- Telugu News Photo Gallery Beauty Tips in Telugu: Add these 2 ingredients to Aloe Vera Gel For For Healthy Glowing Skin
Beauty Tips: ముఖంపై ముడతలు, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? అలోవెరా జెల్‌తో ఇలా చేశారంటే..
మఖంపై ముడతల సమస్యను నివారించుకోవడానికి అలోవెరా జెల్ అద్భుతంగా పని చేస్తుంది. అలోవెరా జెల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి ముడతలను నివారిస్తుంది..
Updated on: Aug 10, 2022 | 9:30 AM

మఖంపై ముడతల సమస్యను నివారించుకోవడానికి అలోవెరా జెల్ అద్భుతంగా పని చేస్తుంది. అలోవెరా జెల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి ముడతలను నివారిస్తుంది.

అలోవెరా జెల్ వడదెబ్బ సమస్యను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఎండలోకి వెళ్లడం వల్ల చర్మంపై సన్ బర్న్ సమస్య ఏర్పడుతుంది. రోజూ అలోవెరా జెల్‌ను చర్మంపై అప్లై చేయడం వల్ల సన్‌బర్న్ తాలూకు మచ్చలు సులువుగా పోతాయి.

కాలుష్యం, జీవనశైలి, హార్మోన్ల అసమతుల్యత కారణంగా చాలా మంది మొటిమలతో బాధపడుతుంటారు. అలోవెరా జెల్‌ను మాయిశ్చరైజర్‌గా రోజూ ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా చేయడం క్రమంగా మొటిమలు తగ్గుముఖం పడతాయి.

జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడకూడదు. ఐతే ఇటువంటివారు చర్మ తేమను కాపాడుకోవడానికి క్రీమ్‌లకు బదులుగా అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

అలోవెరా జెల్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మకాంతి మెరుగుపడుతుంది కూడా. అలోవెరా జెల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిస్తాయి.

అలోవెరా జెల్‌తో విటమిన్ 'ఈ' క్యాప్సూల్స్, కొద్దిగా రోజ్ వాటర్ కలపడం వల్ల కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మకాంతి మెరుగవుతుంది.





























