- Telugu News Photo Gallery Technology photos Avoid these things to increase your smart phone span Telugu Tech News
Tech News: పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. మీ స్మార్ట్ ఫోన్ త్వరగా పాడైపోతుంది..
Tech News: కొందరు తాము ఉపయోగించే ఫోన్‌లు త్వరగా పాడైపోతున్నాయని అంటుంటారు. అయితే స్మార్ట్ ఫోన్‌లు త్వరగా పాడవ్వడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన కొన్ని కారణాలపై ఓ లుక్కేయండి..
Updated on: Aug 09, 2022 | 6:26 PM

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌ల వినియోగం అనివార్యంగా మారిపోయింది. ఏ చిన్న పనికైనా స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించాల్సిన రోజులు వచ్చేశాయ్. అయితే స్మార్ట్‌ఫోన్ ఎన్ని రోజులు పనిచేస్తుందన్నది దానిని మనం ఉపయోగించే విధానంపైనే ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా.? ఈ పనులు చేస్తే మీ ఫోన్ త్వరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అవేంటంటే..

కొందరు స్మార్ట్ ఫోన్‌లు ఫుల్ చార్జ్ చేస్తుంటారు. 99 శాతం అయినా ఇంకో శాతం ఉంది కదా అని చార్జింగ్ పెడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల స్మార్ట్ ఫోన్ పనితీరు దెబ్బ తింటుంది. దీర్ఘ కాలంలో ఇది ఫోన్ ప్రాసెసర్‌పై ప్రభావం చూపుతుంది. బ్యాటరీ కూడా త్వరగా పాడవుతుంది.

ఇక మరికొందరు బ్యాటరీ జీరో స్థాయికి వచ్చే వరకు ఉపయోగిస్తునే ఉంటారు. ఇది కూడా ఫోన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. చార్జింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా వాడుతూనే ఉండడం వల్ల ఫోన్ త్వరగా పాడయ్యే అకాశం ఉంటుంది.

సిరకం ఛార్జర్లు ఉపయోగించడం ద్వారా కూడా ఫోన్‌లు త్వరగా పాడవుతాయి. సాధారణంగా కంపెనీతో వచ్చిన చార్జర్‌ను మాత్రమే ఉపయోగించాలి. కానీ ఒరిజినల్ చార్జర్ పాడైతే చాలా మంది మార్కెట్లో దొరికే నాసిరకం చార్జర్స్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల కూడా ఫోన్ పాడవుతుంది.

కొందరు చీటికి మాటికి చార్జింగ్ పెడుతుంటారు. 10 శాతం తగ్గినా వెంటనే చార్జ్ చేస్తుంటారు. ఇలా చేయకూడదు కనీసం 20 శాతం వచ్చే వరకు చార్జింగ్ జోలికి వెళ్లకూడదు. పదే పదే చార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ కెపాసిటీ తగ్గి ఫోన్ త్వరగా పాడవుతుంది.




