- Telugu News Photo Gallery Technology photos Best smart watches under 5000 you can buy for your sister on Raksha Bandhan Telugu Tech News
Rakhi: రాఖీ కట్టిన సోదరికి స్మార్ట్ వాచ్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి.. రూ. 5 వేల లోపు బెస్ట్ వాచెస్ ఇవే..
Rakhi Gifts: రాఖీ పండగా వచ్చేస్తోంది. అక్కాచెల్లుళ్లు తమ అన్నతమ్ముళ్లకు రాఖీ కట్టడానికి సిద్ధమవుతున్నారు. మరి రాఖీ కట్టిన సోదరీకి బహుమతి ఇవ్వడం మన సంప్రదాయంలోనే భాగమనే విషయం తెలిసిందే. మారుతోన్న కాలానికి అనుగుణంగా వారికి స్మార్ట్ వాచ్‌లను అందిస్తే భలే ఉంటుంది కదూ! రూ. 5 వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ వాచ్‌లపై ఓ లుక్కేయండి..
Updated on: Aug 10, 2022 | 6:25 PM

డిజో వాచ్ డీ: రూ. 5 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్‌ల్లో ఇది ఒకటి. 1.8 ఇంచెస్ డిస్‌ప్లే, 150కిపైగా డైల్స్ ఈ స్మార్ట్ వాచ్ సొంతం. ఐదు రకాల కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ వాచ్ ధర రూ. 2,999గా ఉంది.

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో4: ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 3,499గా ఉంది. ఇందులోని బ్రైట్ డిస్‌ప్లేతో ఎండలో నిల్చున్నా వాచ్ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. 100 స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు 150కిపైగా క్లౌడ్ ఆధారిత, యానిమేటెడ్ వాచ్ ఫేస్‌లు అందించారు.

బోట్ ప్రీమియా: ఈ రాఖీకి మీ సిస్టర్స్‌కు బహుమతిగా ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 4,499గా ఉంది. అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ వాచ్ ప్రత్యేకగా చెప్పొచ్చు. బుల్ట్ ఇన్ స్పీకర్, మైక్రోఫోన్, మెటాలిక్ డిజైన్‌తో రూపించారు. అలాగే ఈ వాచ్‌ను ఐపీ67 డస్ట్, చమట, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో అందించారు.

రియల్‌మీ వాచ్ 2 లైట్: రూ. 4,999రి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్‌లో 5ఏటీఎమ్ వాటర్ రెసిస్టెన్స్ అందించారు. ఎస్‌పీఓ2 సెన్సర్‌తో మరెన్నో ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి.

డిజో వాచ్ ఆర్: రూ. 5000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాచెస్‌లో ఇదీ ఒకటి. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 3,999గా ఉంది. ఇందులో 1.3 ఇంచెస్ అల్ట్రా షార్ప్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 110కిపైనా వాచ్ ఫేసెస్‌ను అందించారు.




