Lazy Day: బద్ధకం మంచిదే.. నేడు లేజీ డే.. ఈరోజు ఏం చేయాలో తెలుసా..

ఒక గంట ఎక్కువ పడుకుంటే బద్ధకం వీడి లెగరా అంటుంటారు ఇంట్లో.. ఏదైనా చెప్పిన పని వెంటనే చెయ్యకపోతే వీడి బద్ధకం తగలెట్టా.. సోమరిపోతులా తయారవుతున్నాడంటూ ఇలా తిడుతూనే ఉంటారు. కాని ఈ బద్ధకం (Lazy ness)ని ఎంజాయ్ చేయడానికి ఓ రోజుందని మీలో ఎంతమందికి తెలుసు.. ప్రపంచ వ్యాప్తంగా

Lazy Day: బద్ధకం మంచిదే.. నేడు లేజీ డే.. ఈరోజు ఏం చేయాలో తెలుసా..
Lazyness
Follow us

|

Updated on: Aug 10, 2022 | 11:18 AM

National Lazy day: ఒక గంట ఎక్కువ పడుకుంటే బద్ధకం వీడి లెగరా అంటుంటారు ఇంట్లో.. ఏదైనా చెప్పిన పని వెంటనే చెయ్యకపోతే వీడి బద్ధకం తగలెట్టా.. సోమరిపోతులా తయారవుతున్నాడంటూ ఇలా తిడుతూనే ఉంటారు. కాని ఈ బద్ధకం (Lazy ness)ని ఎంజాయ్ చేయడానికి ఓ రోజుందని మీలో ఎంతమందికి తెలుసు.. ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 10వ తేదీని నేషనల్ లేజీ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారట. అలాగే బద్ధకం మంచిదేనంటూ.. బిల్ గేట్స్ లాంటి వాళ్లే.. తాను బద్ధకస్తులనే పనిలో పెట్టుకుంటా అని చెపప్పిన మాటలను గుర్తుచేసుకుంటున్నారు. కొందరు శాస్త్రవేత్తలు కూడా బద్ధకం మంచిదే అని.. అయితే అతి బద్ధకం మాత్రం యమ డేంజరస్ అంటున్నారు. అసలు ఈ లేజీనెస్ కు ఒక రోజు కేటాయించడం చిత్రమే అయినా.. ఎప్పుడూ పనిలో నిమగ్నమయ్యే వారు ఓ రోజు ఫుల్ గా రెస్ట్ తీసుకుని.. తమకిష్టమైన పనులను చేసుకునేందుకు నేషనల్ లేజీ డేను పాటిస్తున్నారు.

ఉరుకుల పరుగుల జీవితం.. పొద్దునే మొదలుపెడితే పొద్దుపోయే వరకు ఏదో ఒక పని చేస్తూ మిషన్లలా మనుషులు మారిపోతున్న రోజులివి. ఏ క్షణంలో ఏ పని చేయాలో రాసుకుని మరీ పెట్టుకుని మరీ ఏళ్లతరబడి గడిపేస్తుంటారు కొందరు. కాని కొంతమంది మాత్రం ఎప్పుడూ మంచం మీదనో, సోఫాలోనో పడుకుంటూ లేజీగా గంటలు గంటలు గడిపేస్తారు. ఇలాంటి వారిని మినహయిస్తే బద్ధకం ప్రతి మనిషికి ఎంతో కొంత మంచిదేనంటున్నారు వైద్య నిపుణులు. రోజంతా మిషన్లలా పనిచేస్తూ శరీరంలో శక్తి అంతా ఆవిరైపోయేలా.. క్షణం క్షణం ఆందోళనతో జీవించే జీవితంతో నిద్ర కూడా పోని రోజులివి. దీంతో అనారోగ్యాల బారిన పడి సంపాదించినదంతా ఆసుపత్రుల బిల్లులు కట్టాల్సిన పరిస్థితులు, ఈక్రమంలో పని మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ రీఫ్రెష్ అయిపోతామని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

లేజీగా గడపడం కూడా ఒక రకంగా చికిత్స వంటిదేనని, శరీరాన్ని, మనసును పూర్తిస్థాయిలో పునరుత్తేజితం చేయడానికి దోహడపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇదే క్రమంలో బద్ధకాన్ని అలవాటుగా మార్చుకోకూడదని హెచ్చరిస్తున్నారు. బద్ధకం అనేది రీఫ్రెష్ మెంట్ కోసమే తప్ప పని చేయకుండా తప్పించుకోవడానికి కాదంటున్నారు వైద్యులు. లేజీ డే రోజు ఏం చేయాలో కూడా పలువురు పరిశోధకులు సూచిస్తున్నారు. ఒత్తిడిని దూరం చేయడం కోసం ఈరోజు కావల్సినంత సమయం నిద్రపోవాలి, దీనిద్వారా రీఫ్రెష్ అయ్యి కొన్ని రోజుల వరకు పనితీరు మెరుగ్గా ఉండే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కు కనీసం ఈఒక్కరోజైనా దూరంగా ఉండాలి. ఎక్కువుగా నోటిఫికేషన్లు, మెసెజ్ లు చూస్తూ ఇబ్బంది పడకుండా ఇంటర్నెట్ ను ఆఫ్ చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. ప్రధానంగా నగదు, ఆర్థిక సంబంధిత సమస్యల గురించి ఆలోచించకుండా.. ఇష్టమైన పనులపై సమయాన్ని కేటాయించాలి. ఇలా ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఎక్కువ సంతోషం పొందొచ్చు. బద్ధకస్తులను అందరూ తిడుతుంటారు.. కాని లేజీగా ఉండేవాళ్లు ఏదైనా పనిని తేలికగా ఎలా చేయాలో అందరికంటే ఎక్కువుగా ఆలోచిస్తారని పలు అధ్యయనాల్లో తేలింది. ఈరోజు టీవీలో మీకిష్టమైనది చూస్తూ గడపండి. ఈసమయంలో ఇష్టమైన ఆహారాన్ని తినండి.. ప్రశాంతంగా నిద్రపోతే మెమరీ పవర్ కూడా పెరుగుతుందంట. మరెందుకు ఆలస్యం ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా డే మొత్తం ఎంజాయ్ చేసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..