AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: ఏవండోయ్.. మీకే ఈ సవాల్.. ఈ ఫోటోలో 12 పాండాలను ఒక నిమిషంలో గుర్తించగలరా..?

మీ కోసమే ఈ క్రేజీ పజిల్. ఇందులో 12 పాండాలను కనిపెట్టడం చాలా టఫ్. ఇంకెందుకు ఆలస్యం.. మీ ఐ పవర్ ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోండి...

Photo Puzzle: ఏవండోయ్.. మీకే ఈ సవాల్.. ఈ ఫోటోలో 12 పాండాలను ఒక నిమిషంలో గుర్తించగలరా..?
Find Pandas
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2022 | 1:05 PM

Share

Optical illusion: మాయచేసే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు ఈ మధ్య బాగా సర్కులేట్ అవుతున్నాయి.  కన్‌ఫ్యూజ్ చేసే ఇలాంటి ఫోటో పజిల్స్ బ్రెయిన్ షార్ప్ చేసేందుకు బాగా ఉపయోగపడతాయి. బుర్రకు కాస్తంత మేత వేసేందుకు, ఐ పవర్ ఏ లెవల్‌లో ఉందో టెస్ట్ చేసుకునేందుకు ఇవి బాగా యూజ్ అవుతాయి. తాజాగా క్యూట్ యానిమల్స్ అయిన పాండాలకు(pandas) సంబంధించిన ఓ కిర్రాక్ పజిల్ మీ ముందుకు తీసుకొచ్చాం. ముందే చెప్తున్నాం ఈ  పజిల్ సాల్వ్ చేయడం చాలా టఫ్. ఆగమాగమవుతారు. అది కూడా ఇచ్చిన సమయంలో ఆ పాండాలు అన్నింటిని కనిపెట్టడం కత్తిమీద సామే. వాటిలో మూడింటిని సులభంగానే గుర్తించవచ్చు. కాస్త ఔట్ ఆఫ్ బాక్స్ థింక్ చేస్తేనే మిగతావి మీకు తారసపడతాయి. ఈ పజిల్ ఇప్పుడు ఇంటర్నెట్‌(Internet)ను షేక్ చేస్తుంది. పైన ఇచ్చిన ఫోటోలో 12 పాండాలు ఉన్నాయి. వాటిని 60 సెకన్లలో మీరు కనిపెట్టాలి. చాలామంది నెటిజన్స్ వాటిని కనిపెట్టేందుకు తెగ కష్టపడుతున్నారు. కొందరు ఆల్మోస్ట్ 10 పాండాలను కనిపెట్టారు. మరొక్కసారి ట్రై చేసి చూడండి. ఇక కష్టం అయితే సమాధానం ఉన్న ఫోటోను దిగువన ఇచ్చేస్తున్నాం.

Pandas

చూశారా.. 12 పాండాలు ఉన్నాయ్. కాస్త శ్రద్ధ పెట్టి చూస్తే మీరు కూడా చాలా వాటిని గుర్తించేవారు. 12లో కనీసం 9 లేదా 10 పాండాలను గుర్తించినా మీరు గ్రేటే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామందికి 5 లేదా 6 పాండాలు గుర్తించడమే గగనమయ్యింది. ఇలాంటి పజిల్స్ మీలోని సృజనాత్మకతను పెంచుతాయి. అందుకే మరిన్ని మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఎనీ వే హ్యపీ ఫ్రెండ్సిప్ డే. మీ దోస్తులతో ఈ పజిల్ పంచుకోండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి