Health Tips: హెల్దీ లైఫ్.. ఆరోగ్యంగా ఉండాలంటే పరగడుపున వీటిని తీసుకోండి.. ఎనర్జీతోపాటు బోలెడన్ని ప్రయోజనాలు..
కొన్ని ఆహార పదార్థాలను పరగడుపున (ఖాళీ కడుపుతో) తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని.. శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
Eat on an Empty Stomach: ఎంత బిజీగా ఉన్నా.. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం చాలాముఖ్యం. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. సరైన సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు పలు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలాంటి ఆహార పదార్థాలు మన వంటింట్లోనే చాలా ఉన్నాయి. అయితే.. వాటిని వినియోగించే సరైన సమయం, పద్ధతి తెలియకపోతే అది ప్రయోజనానికి బదులుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకే అలాంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని ఆహార పదార్థాలను పరగడుపున (ఖాళీ కడుపుతో) తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని.. శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఖాళీ కడుపుతో తినాల్సిన ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
గోరువెచ్చని నీటిలో తేనె..
తేనెలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఎంజైమ్‌లు కడుపుని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ పానీయాన్ని తీసుకుంటే ఇది టాక్సిన్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా జీవక్రియను కూడా వేగవంతం చేస్తుంది.
పుచ్చకాయ – బొప్పాయి..
పరగడుపున పుచ్చకాయ, బొప్పాయి తినడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చక్కెర కోరికలను అరికడతాయి. బొప్పాయి తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి. మరోవైపు, పుచ్చకాయలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె, కళ్ళకు మంచివిగా పేర్కొంటారు.
డ్రై ఫ్రూట్స్, మొలకలు..
ఉదయం పూట డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు తినడం చాలామంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఉదరం pH స్థాయిని సాధారణీకరించడంలో కూడా సహాయపడతాయి.
వోట్మీల్..
తక్కువ కేలరీలతో పోషకాహారం కావాలంటే అల్పాహారం కోసం వోట్మీల్, గోధుమ రవ్వ ఉత్తమమైనవి. ఇవి శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తాయి. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఫ్రూట్స్..
ఎనర్జీ బూస్ట్ కోసం ఖర్జూరాలను ఉదయం తినండి. అలాగే విటమిన్లు, పీచు కోసం అరటి, యాపిల్, బొప్పాయి వంటి పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం