Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Tea: తిన్న తర్వాత వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే.. ఎందుకంటే..

గ్రీన్ టీ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాన్ని పెంచుతుంది. అంతేకాకుండా జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Green Tea: తిన్న తర్వాత వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే.. ఎందుకంటే..
Green Tea
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 10, 2022 | 9:42 AM

Best Time To Drink Green Tea: ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది అనేక సమస్యల బారిన పడుతున్నారు. అందుకే ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ రోజుల్లో చాలామంది ఆఫీసులో లేదా ఇంట్లో గ్రీన్ టీ తాగుతుంటారు. కొంతమందికి గ్రీన్ టీ రుచి నచ్చకపోవచ్చు.. కానీ దాని ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత తాగడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే.. గ్రీన్ టీ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాన్ని పెంచుతుంది. అంతేకాకుండా జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీ టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తొలగిస్తుంది. గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అందుకే కొంతమంది ఆహారం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగడానికి కారణం ఇదే. తిన్న ఆహారం జీర్ణమై బరువు కూడా తగ్గుతుందని వారు భావిస్తున్నారు. తిన్న తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా? ఈ విషయాలను తెలుసుకోండి..

తిన్న తర్వాత గ్రీన్ టీ తాగుతున్నారా..?

ఆహారం తిన్న తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతుందని లేదా జీర్ణక్రియకు సహాయపడుతుందని మీరు అనుకుంటే.. తిన్న వెంటనే ఏదైనా టీ తాగడం హానికరం అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అవసరమైన పోషకాలను గ్రహించడం కష్టతరం చేస్తుంది. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ భోజనం చేసిన వెంటనే తాగకూడదు. ఇందులో ఉండే టానిన్లు, కెఫిన్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇంకా అజీర్తిని కూడా కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

రెండు గంటల ముందు.. లేదా రెండు గంటల తర్వాత..

మీరు లంచ్ లేదా డిన్నర్ టైమ్‌లో గ్రీన్ టీ తాగాలనుకుంటే.. తిన్న అరగంట నుంచి 45 నిమిషాల తర్వాత మాత్రమే తాగాలి. గ్రీన్ టీని తినడానికి 2 గంటల ముందు, తిన్న 2 గంటల తర్వాత తాగడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు.

పరగడుపున టీ తాగితే..

కొంతమంది ఉదయాన్నే టీకి బదులుగా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతారు. కానీ అలా చేయడం వల్ల మీకు హాని కలుగుతుంది. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల వికారం వస్తుంది. ఇందులో ఉండే టానిన్లు కడుపులో యాసిడ్‌ని పెంచుతాయి. దీని కారణంగా మీకు కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్య ఉండవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం