Amit Shah: రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్.. మీరు ముందు అది అధ్యయనం చేయాలంటూ సూచన..

భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఫైర్ అయ్యారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఓ పార్ట కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ..

Amit Shah: రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్.. మీరు ముందు అది అధ్యయనం చేయాలంటూ సూచన..
Amit Shah
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 11, 2022 | 1:27 PM

Amit Shah: భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) పై కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా (Amit Shah) ఫైర్ అయ్యారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఓ పార్ట కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడానికి ముందుగా దేశ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ బ్రాండ్‌ టీషర్ట్‌ ధరించి.. భారత్ జోడో యాత్రకు వెళ్లారని ఆరోపించారు. గతంలో పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ ప్రసంగాన్ని గుర్తుచేయాలనుకుంటున్నానంటూ భారత్‌ను అసలు ఒక దేశమే కాదని రాహుల్ వ్యాఖ్యానించారన్నారు. ఈ విషయాన్ని ఆయన ఏ పుస్తకంలో చదివారని ప్రశ్నించారు. ఇదొక దేశం.. దీని కోసం లక్షలాది మంది తమ ప్రాణాలను త్యాగం చేశారంటూ ఈవిషయాలు రాహుల్ గాంధీకి తెలియవని అమిత్‌ షా అన్నారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేసేందుకు వెళ్లారు. అంతకంటే ముందు ఆయన దేశ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని హితవుపలికారు. అభివృద్ధి కోసం కాదని.. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రపై బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ప్రతి రోజూ జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) కూడా రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఐక్యతను ఎవరు దెబ్బతీశారని.. ఇప్పుడు ఇటువంటి యాత్ర చేపట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆమె రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరు సాహసించారో ఆయన ముందు సమాధానం చెప్పాలన్నారు. దేశం ముక్కలు ముక్కలవుతుంది అని నినాదాలు చేసిన వ్యక్తిని మీ పార్టీలో సభ్యుడిగా చేర్చుకున్నారని గుర్తుచేశారు. కర్ణాటక పర్యటనలో స్మృతి ఇరానీ ఈవ్యాఖ్యలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం