Andhra Pradesh: దసరాకు ఊరెళ్లేదెలా.. విపరీతంగా పెరిగిపోతున్న వెయిటింగ్ లిస్ట్.. చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీ ఛార్జీలు..

దసరాకు (Dussehra) ఇంకా దాదాపు నెల రోజులు టైమ్ ఉంది. నగరాల్లో స్థిరపడిన వారు పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తుంటారు. అది కూడా రైలు ప్రయాణాలకే మొగ్గు చూపిస్తారు. దూర ప్రాంతాల వెళ్లేవారు నెలరోజులు...

Andhra Pradesh: దసరాకు ఊరెళ్లేదెలా.. విపరీతంగా పెరిగిపోతున్న వెయిటింగ్ లిస్ట్.. చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీ ఛార్జీలు..
Trains
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 11, 2022 | 6:36 PM

దసరాకు (Dussehra) ఇంకా దాదాపు నెల రోజులు టైమ్ ఉంది. నగరాల్లో స్థిరపడిన వారు పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తుంటారు. అది కూడా రైలు ప్రయాణాలకే మొగ్గు చూపిస్తారు. దూర ప్రాంతాల వెళ్లేవారు నెలరోజులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. రద్దీ కారణంగా దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లు నడిపిస్తుంది. అయితే ఈ సారి మాత్రం పండుగకు నెలరోజుల ముందు నుంచే ప్రధాన రైళ్లల్లో సీట్లన్నీ బుక్ అయిపోయాయి. వెయిటింగ్‌ లిస్ట్‌ విపరీతంగా పెరిగిపోతోంది. అక్టోబరు 3న దుర్గాష్టమి, 4న మహార్నవమి, 5న విజయదశమి కావడంతో ఈ నెల 30 నుంచి అక్టోబర్ 2 వరకు ఎక్కువ ప్రయాణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో నడిచే రైళ్లన్నీ ఇప్పటికే నిండిపోగా.. వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. కొన్ని రైళ్లల్లో అయితే వెయిటింగ్ లిస్ట్ (Waiting List) పరిధి దాటిపోయి ఎర్రర్ చూపిస్తోంది. ఫలక్‌నుమా, గౌహతి, కోణార్క్‌, ఈస్ట్‌కోస్ట్‌, విశాఖ, హౌరా, తిరుపతి, పూరి రైళ్లలో ఖాళీ లేకపోగా నిరీక్షణ జాబితా 100-200 వరకు ఉన్నాయి. పండగకు ఎలాగైనా ఊర్లకు వెళ్లాలనుకునేవాళ్లు స్లీపర్‌ క్లాస్‌కు బదులు కొంత ఎక్కువ మొత్తం వెచ్చించి ఏసీ త్రీ టైర్‌లో వెళ్లాలనుకుంటున్నప్పటికీ అందులోనూ టిక్కెట్లు దొరకడం లేదు. ఇంటర్‌సిటీ, డబుల్‌డెక్కర్‌ వంటి కొన్ని సర్వీసుల్లో మాత్రమే సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి.

మరోవైపు.. బస్సు ఛార్జీలు కూడా అధికంగా ఉన్నాయి. ఇప్పటికే వివిధ సెస్సులు, డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఛార్జీలు పెంచేసింది. ప్రైవేటు సర్వీసులు వీటికి రెట్టింపు ధరలను ప్రయాణీకుల నుంచి వసూలు చేస్తున్నాయి. రైళ్లలో స్లీపర్‌క్లాస్‌ ఛార్జీలతో పోలిస్తే ఆర్టీసీ ఛార్జీలే అధికంగా ఉండడంతో ప్రయాణీకులపై పెను భారం పడుతోంది. సూపర్‌ లగ్జరీ, ఏసీ ఇంద్రలో టిక్కెట్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారమంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం రోడ్‌ స్టేషన్‌ కు రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌కు రూ.320 కాగా.. బస్సులో రూ.830 ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..