AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakeman: విషాదం.. ఎన్నో పాములకు ఊపిరిపోసిన ప్రాణదాత.. అదే పాముకాటుకు బలైపోయిన స్నేక్‌మ్యాన్‌..

ఆదివారం నాడు అతని మృతదేహానికి కుటుంబ సభ్యులు అంతిమ సంస్కరాలు నిర్వహించారు. అతని ఇంటి నుంచి ముక్తిధామం వరకు అంతి యాత్ర చేపట్టారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Snakeman: విషాదం.. ఎన్నో పాములకు ఊపిరిపోసిన ప్రాణదాత.. అదే పాముకాటుకు బలైపోయిన స్నేక్‌మ్యాన్‌..
Snakeman
Jyothi Gadda
|

Updated on: Sep 12, 2022 | 9:24 AM

Share

Snakeman: పాములంటే.. చాలా మందికి చచ్చేంత భయం.. పాము కనిపించింది అంటే చాలు.. అంతా హడలి పోతారు. కానీ అతడు మాత్రం వాటితో ఆడుకుంటాడు . వాటిని పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతాడు. అలాంటి పాముకు ఏదైనా అనారోగ్యం కలిగినా, ఆపద వాటిల్లినా ఊరుకోడు..అలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పాములకు సపర్యాలు చేశాడు. మరెన్నో జనావాసాల్లోకి వచ్చిన పాములను బంధించి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. కానీ, పాముకు పాలుపోసి పెంచినా అది విషాన్ని చిమ్ముందన్నట్టుగా .. ఆయన అదే సర్పం కాటుకు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని సర్దార్ సిటీ చురులో స్నేక్‌ మ్యాన్ వినోద్ తివారీ ఎంతో ఫేమస్‌..45 ఏళ్ల తివారీ విషపూరిత పాములను సులభంగా పట్టడంలో ప్రావీణ్యం సంపాదించాడు. పాములను జనావాసాల నుంచి తొలగించి అడవిలో వదిలే వరకు అతడు నిద్రపోడు. కానీ, ఇప్పుడు అదే పాములు తమ ప్రాణదాతను బలిగొన్నాయి. అవును,..స్నేక్‌ మ్యాన్ వినోద్ తివారీ పాము కాటు కారణంగా మరణించాడు. పాములు పట్టే తివారీ.. నగరంలోని ఓ రద్దీ ప్రదేశంలోకి ప్రవేశించిన విషసర్పాన్ని రక్షించి అడవిలో వదిలేందుకు వెళ్తున్నాడు. అత్యంత విషపూరితమైన పామును ఎంతో ఈజీగా పట్టుకుని బ్యాగులో వేసుకున్నాడు..ఈ క్రమంలోనే అది ఉన్నట్టుండి అతని వేలిని కాటువేసింది…దాంతో అతను స్పృహతప్పి పడిపోయాడు. ఇదంతా ఘటన స్థలంలో అమర్చిన సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది. అంతలోనే స్థానికులు గుమిగూడి అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు..ప్రమాదాన్ని గ్రహించిన తివారి..ఈ రోజుతో పనైపోయింది అన్నాడు.. అంతే, ఇక ఇవే అతని చివరి మాటలు అని చెప్పాడు. ఆ తర్వాత నేలపై పడి కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించారు. హుటాహుటినా ఆస్పత్రికి కూడా తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

తివారీ మృతదేహానికి ఘనంగా అంతిమ సంస్కరాలు నిర్వహించారు. అతని ఇంటి నుంచి రా బస్టాండ్ ముక్తిధామం వరకు అంతి యాత్ర చేపట్టారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తివారీ స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ..అతనికి పాములను పట్టుకోవడంలో ఎంతో ప్రావీణ్యం ఉంది. దాదాపు ఇరవై ఏళ్లపాటు పాములకు ప్రాణదాతగా ఉంటున్నాడు.. అతను ఏకకాలంలో ఐదు-ఐదు నల్ల నాగుపాము వంటి విషపూరిత పాములను నియంత్రించేవాడు. తనకు ఊహవచ్చిన నాటి నుంచి అతను పామును, ఆవులను హింసిస్తే..ఎవరినీ క్షమించేవాడు కాదని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

వినోద్ తివారీ కుమారుడు రజత్ మాట్లాడుతూ తన తండ్రి జివిఎం ఇనిస్టిట్యూట్‌లో హార్టికల్చర్ వర్కర్ల సూపర్‌వైజర్‌గా పని చేసేవారని తెలిపారు. ఎక్కడి నుంచైనా పాములు బయటకు వచ్చాయనే సమాచారం అందిన వెంటనే.. పనులన్నీ వదిలేసి వెంటనే అక్కడికి చేరుకునేవాడు. అతనికి జంతువులకు చికిత్స చేయటమంటే ఇష్టమని చెప్పాడు. అతడు ఎన్నో గాయపడిన పాములకు కూడా చికిత్స చేసేవాడు. అందుకోసం తనతో పాటు ఎప్పుడూ ఓ అత్యవసర కిట్‌ని వెంటపెట్టుకునేవాడని చెప్పాడు. అలా ఏదైనా గాయమైన పాముకు నయమయ్యే వరకు, అతను దానిని తన వద్ద ఉంచుకునేవాడని..దానికి పూర్తిగా నయం అయితన తర్వాతే..ఆ పామును అడవిలో వదిలేసేవాడని గుర్తు చేసుకున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి