Gyanvapi case: జ్ఞానవాపి కేసులో ఇవాళ కీలక తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ.. కాశీ విశ్వనాథ ఆలయం వద్ద భద్రత పెంపు..
మసీదు కాంప్లెక్స్‌లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. కీలక తీర్పు నేపథ్యంలో వారణాసిలో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ శృంగార్ గౌరీ- జ్ఞానవాపి మసీదు Gyanvapi mosque-Shringar gauri) కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో వాదనలు గత నెలలోనే పూర్తికావడంతో ఇవాళ తీర్పు రానుంది. మసీదు కాంప్లెక్స్‌లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. కీలక తీర్పు నేపథ్యంలో వారణాసిలో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మతపరంగా సున్నితమైన అంశం కావడంతో వారణాసిలో నిషేధ ఉత్తర్వులను అమల్లోకి తీసుకొచ్చి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు. నగరం మొత్తాన్ని రెండు సెక్టార్లుగా పరిగణించి పోలీసు బలగాలను కేటాయించామని, సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్, ఫుట్ మార్చ్ నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఈ పిటిషన్-అభ్యంతరాలపై ఇప్పటికే వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి అజయ్ కృష్ణ..ఆగష్టు 24వ తేదీనే తీర్పును సిద్ధం చేసి వాయిదా వేశారు.
అయితే ఇవాళ ఆ తీర్పును ప్రకటించనున్నారు. తీర్పు నేపధ్యంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, హోటళ్లు, అతిథి గృహాల్లో విస్తృత తనిఖీలు చేపట్టినట్టు చేపట్టారు. సామాజిక మాధ్యమాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం