Viral Video: లారీలో పూరీ జగన్నాథుడి విగ్రహాం తరలింపు.. వైరలవుతున్న వీడియోపై నెటిజన్ల ఆగ్రహం..

వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు విగ్రహాన్ని తీసుకువెళుతున్న అజాగ్రత్త విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దానికి బాధ్యులైన వ్యక్తుల నుండి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Viral Video: లారీలో పూరీ జగన్నాథుడి విగ్రహాం తరలింపు.. వైరలవుతున్న వీడియోపై నెటిజన్ల ఆగ్రహం..
Lord Jagannath's Idol
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 12, 2022 | 8:47 AM

Viral Video: జగన్నాథుని విగ్రహాన్ని అగౌరవం కలిగింది. ఏకండా ఆ దేవుడి విగ్రహాలనే నిర్లక్ష్యంగా వెదురు కర్రల లోడ్‌తో ట్రక్కులో వేసి తీస్తుకెళ్తుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారిపై ట్రక్కు వెళ్తుండగా వీడియో తీసిన కొందరు స్థానికులు దానిని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.ఈ క్లిప్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గురువారం భువనేశ్వర్-జలేశ్వర్ హైవేపై ప్రయాణిస్తున్న బినయ్ ప్రధాన్ అనే వ్యక్తి వ్యాన్‌కు వేలాడుతున్న విగ్రహాన్ని తాడుకు కట్టి ఉంచి తీసుకెళ్తుండగా స్థానికులు వీడియో తీశారు. ఇదే వీడియో వైరల్‌ అవుతోంది.

వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు విగ్రహాన్ని తీసుకువెళుతున్న అజాగ్రత్త విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దానికి బాధ్యులైన వ్యక్తుల నుండి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సదరు వాహనం, టెంట్ హౌజ్ యజమాని స్పందించారు. తన సిబ్బందితో కలిసి అతడు జలేశ్వర్‌లోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించి తమ తప్పును క్షమించమని వేడుకున్నారు.

ఇవి కూడా చదవండి

బాలాసోర్‌లోని గణేష్‌ పూజా పండులో విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, గణేష్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత జగన్నాథుని విగ్రహంతో పాటు ఇతర సామాగ్రి తన స్వగ్రామమైన జలేశ్వర్‌కు తరలిస్తున్నట్లు డేరా యజమాని తెలిపారు. “ఆ రోజు తాను స్టేషన్‌లో లేనని, తన వద్ద పనిచేస్తున్న కార్మికులు ఒడియాయేతరులు కావటంతో స్థానికుల మనోభావాల గురించి వారికి తెలియదన్నారు. తన వద్ద పనిచేసే కార్మికులు ఏం చేసినా అది నా కూడా వర్తింస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్నాథ భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను..అని టెంట్ హౌస్ యజమాని చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి