Viral News : వామ్మో.. ఇదేం పిచ్చి.. అమ్మవారి ముందు నాలుక కోసుకున్న భక్తుడు.. ఆపై..

అక్కడి గంగానదిలో పవిత్ర స్నానం చేశాడు. ఆపై ఆలయంలో పొర్లుదండాల ప్రదక్షిణలు చేశాడు. అనంతరం వెంట తెచ్చిన

Viral News : వామ్మో.. ఇదేం పిచ్చి.. అమ్మవారి ముందు నాలుక కోసుకున్న భక్తుడు.. ఆపై..
Up Devotee
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 10, 2022 | 9:24 PM

Viral News : ఓ భక్తుడు చేసిన విచిత్ర పనికి అక్కడి భక్తులు, స్థానికులు హడలెత్తిపోయారు. మా శీత్లా ఆలయంలో ఒక భక్తుడు తన నాలుకను కోసుకుని స్వామివారికి సమర్పించాడు. దాంతో అక్కడంతా ఒక్కసారిగా తీవ్ర కలకలం మొదలైంది. కౌశాంబికి చెందిన సంపత్ (38) అనే భక్తుడు ఈ దారుణానికి ఒడిగట్టడంతో హుటాహుటినా అతన్ని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కౌశాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్, భార్య బన్నో దేవితో కలిసి శనివారం ఆ జిల్లాలోని మా శీత్లా ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి గంగానదిలో పవిత్ర స్నానం చేశాడు. ఆపై ఆలయంలో పొర్లుదండాల ప్రదక్షిణలు చేశాడు. అనంతరం వెంట తెచ్చిన బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. ఆలయం ప్రధాన ద్వారం వద్ద తెగిన నాలుకను ఉంచి దేవతకు సమర్పించాడు. తీవ్రంగా రక్తం కావడంతో భక్తుడు సంపత్‌ను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సంపత్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆలయాన్ని సందర్శించాలని శుక్రవారం రాత్రే భర్త తనతో అన్నాడని భార్య బన్నో దేవి తెలిపింది. దీంతో శనివారం ఆలయాన్ని సందర్శించామని, అయితే ఇలా నాలుక కోసుకోవడాన్ని తాను ఊహించలేదని ఆమె చెప్పింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!