Viral Video: రూ.1కే పట్టుచీర.. వాళ్లకు ఉచితం.. కిలోమీటర్ల మేర క్యూకట్టిన జనం.. ఎక్కడంటే
షో రూమ్ ప్రారంభించి సంవత్సరం పూర్తి కావడం తో తమ షో రూమ్ కి వచ్చే కస్టమర్ల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ షో రూమ్ లో మహిళల కోసం పట్టు చీరలు
Viral Video: వస్త్రదుకాణం ఇచ్చిన బంపర్ ఆఫర్.. ఒక రూపాయికే పట్టు చీర.. కిలో మీటర్ల మేర మహిళల పడిగాపులు ఓ షాపింగ్ మాల్ రూ.1కే చీర ఇస్తామంటూ ప్రచారం చేయడంతో భారీ ఎత్తున మహిళలు, పురుషులు ఎగబడ్డారు.అంతేకాదు.. ఆటో డ్రైవర్లకు ఉచితంగా చీరలు అందిస్తామంటూ ప్రకటించడంతో ఆటోలతో సహా డ్రైవర్లు క్యూకట్టారు. దీంతో యాజమాన్యం కూడా ఊహించని రీతిలో చీరల కోసం మహిళలు పోటెత్తారు దాంతో అక్కడ గందరగోళం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనం రద్దీతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయినా కానీ, ఎవరూ దాన్ని పట్టించుకోలేదు.. చీరల కోసం ఎగడ్డారు. చివరకు పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎక్కడ ఏంటీ అన్న వివరాలు ఇక్కడ తెలుసుకుందాం…
తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన శ్రీ వెంకటేశ్వరా సిల్క్స్ షోరూం… షో రూమ్ ప్రారంభించి సంవత్సరం పూర్తి కావడం తో తమ షో రూమ్ కి వచ్చే కస్టమర్ల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ రోజు తమ షో రూమ్ లో మహిళల కోసం పట్టు చీరలు కేవలం ఒక రూపాయికే ఇస్తున్నారు…ఆటో డ్రైవర్లకు ఉచితంగా పట్టు వస్త్రాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. వీటితో పాటు చాలా ఆఫర్స్ ఉన్నాయని పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం తో షో రూమ్ ముందు మహిళలు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఆటో డ్రైవర్లు కూడా ఉచితంగా ఇస్తున్న బట్టలు తీసుకోవడానికి పోటీపడ్డారు. పోలీసులు ఎంత వారించినా మహిళలను కంట్రోల్ చేయలేకపోయారు.
ఉదయం నుంచే మహిళలు పడిగాపులు కాయడం, షో రూమ్ తెరవగానే ఒక్కసారిగా మహిళలు లోపలికి వెళ్ళడానికి పోటీపడడంతో పలువురికి గాయాలయ్యాయి. వాటిని కూడా లెక్క చేయకుండా చీరల కోసం ప్రయత్నించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి