AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psycho: ఇలాంటి సైకోలు కూడా ఉంటారు.. అమ్మాయిలు జర భద్రం.. సీసీ టీవీలో అడ్డంగా దొరికిపోయిన కామపీశాచి

పోలీసులు విచారణలో పలు విస్తుగొలిపే విషయాలు వెల్లడైనట్టుగా తెలిపారు. అజిత్ కుమార్ ఇంట్లోవారు తనకు పెళ్లి చేయకపోవడంతో..

Psycho: ఇలాంటి సైకోలు కూడా ఉంటారు.. అమ్మాయిలు జర భద్రం.. సీసీ టీవీలో అడ్డంగా దొరికిపోయిన కామపీశాచి
Chennai Man
Jyothi Gadda
|

Updated on: Sep 10, 2022 | 8:01 PM

Share

Chennai: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను అసభ్యకరంగా తాకుతూ.. ఆనందించటం ఆ కామాందుడికి అలవాటు..అలాంటి నీచుడి వెకిలి చేష్టలతో అక్కడి స్థానిక మహిళలు, యువతులు విసిగెత్తిపోయారు. సదరు దుర్మార్గుడిని అరెస్టు చేసి అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. చెన్నైలోని మడిపాక్కం పక్కనే ఉన్న కీల్‌కతలే ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం మడిపాక్కం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చెన్నై మడిపాక్కం పక్కనే ఉన్న కీల్‌కతలే ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం మడిపాక్కం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌కు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్ స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. రోడ్డుపై వెళ్తున్న మహిళలను లైగింక వేధింపులకు గురిచేసిన వ్యక్తి వినియోగించిన టూవీలర్‌ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేసిన విచారణ చేపట్టారు పోలీసులు.

సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ..చెన్నై మడిపాక్కం మూవరసంపేట్ రాఘవ నగర్ 11వ ప్రధాన రహదారికి చెందిన అజిత్ కుమార్ అనే 22 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా…అజిత్‌కుమార్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. గత 10 రోజులుగా మడిపాక్కం కిలికత్తలైలో రోడ్డుపై ఒంటరిగా వెళ్లే మహిళలను వెనుక భాగంలో కొట్టడం అలవాటుగా చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. చెన్నైలో ఇంకా పలు ప్రాంతాల్లో ఇలాంటి వెకిలి చేష్టలకు పాల్పడినట్టుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి
Chennai Man F

పోలీసులు విచారణలో పలు విస్తుగొలిపే విషయాలు వెల్లడైనట్టుగా తెలిపారు. అజిత్ కుమార్ ఇంట్లోవారు తనకు పెళ్లి చేయకపోవడంతో..ఆ విచారంలోనే..ఇంటర్ నెట్ లో అశ్లీల చిత్రాలు చూడటం అలవాటు చేసుకున్నాడని, దాంతోనే ఆడవాళ్లను టచ్ చేయాలని భావించి పెయింట్ పని ముగించుకుని ఇంటి నుంచి బైక్ తీసుకుని వెళ్లేవాడు. సాయంత్రం వేళల్లో వేర్వేరు ప్రాంతాల్లో..అదును చూసి మహిళలతో చేతులు తడుముకోవడం వంటివి చేస్తూ అసభ్యంగా ప్రవర్తించే వాడని విచారణలో చెప్పినట్టుగా పోలీసులు వెల్లడించారు. గతంలోనే మహిళలపై లైంగిక వేధింపులు, 2018లో మైనర్‌గా ఉన్నప్పుడు మణికందన్ అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో కూడా అజిత్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసినట్టుగా తేలింది. విచారణ అనంతరం పోలీసులు అజిత్‌ కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి