Andhra Pradesh: ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని దాటి పరీక్ష రాసిన యువతి.. వీడియో చూస్తే హ్యాట్సాఫ్ అంటారు..
భారీ వర్షాల వల్ల చంపావతి నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మర్రి వలస గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
Andhra Pradesh: ఓ యువతి పరీక్షకు హాజరయ్యేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి పెద్ద సాహసమే చేసింది. 21 ఏళ్ల ఆ యువతి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని దాటి తన గమ్యస్థానాన్ని చేరుకుంది. తన ఇద్దరు సోదరుల సహాయంతో నిండుకుండాలా ప్రవహిస్తున్న నది దాటింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. చంపావతి నదిలో ఈదుకుంటూ వెళ్లిన ఆ యువతికి సంబంధించిన ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీడియో ఆధారంగా ఆ యువతి పేరు కళావతిగా గుర్తించబడిన అమ్మాయికి ఆమె సోదరులు సహాయం చేశారు. మహిళ ఈత కొడుతున్న 55 సెకన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏపీలోని విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మర్రి వలస గ్రామానికి చెందిన తాడ్డి కళావతి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. శనివారం జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు శుక్రవారమే ఇంటి నుంచి ప్రయాణం ప్రారంభించాలనుకున్నారు. కానీ, భారీ వర్షాల వల్ల చంపావతి నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మర్రి వలస గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దాంతో ఏం చేయాలో పాలు పోని స్థితిలో ఉన్న కళావతికి ఆమె ఇద్దరు సోదరులు సాయం చేశారు.. ఆమెతో పరీక్ష రాయించేందుకు గానూ కళావతి ఇద్దరు సోదరులు ఆమెను ఎలాగైనా నదిని దాటించాలని అనుకున్నారు.
21-year-old girl swims the river to attend the exam in Vizianagaram. Risking her life she with the help of her brother crossed the flooded Champavathi river so that she can attend the exam in Vizag. Due to heavy rain, several rivers in North coastal AP overflowing. #AndhraPradesh pic.twitter.com/ezGskpg5BH
— Ashish (@KP_Aashish) September 10, 2022
వెంటనే తమ సోదరిని భుజాలపైన ఎక్కించుకుని… మెడలోతు నీటిలో ప్రాణాలకు తెగించి నడుస్తూ నదిని దాటారు. తరువాత అందుబాటులో ఉన్న వాహనాల ద్వారా ఆమె తన గమ్యస్థానానికి చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోను పలువురు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి