Health Tips: నేలపై కూర్చుని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే.. వెంటనే డైనింగ్‌ టేబుల్‌ని అవతల విసిరేస్తారు..!

హాయిగా నేల మీద కూర్చొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అంతేకాదు. ఇలా నేలమీద కూర్చుని తినటం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Health Tips: నేలపై కూర్చుని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే.. వెంటనే డైనింగ్‌ టేబుల్‌ని అవతల విసిరేస్తారు..!
Floor Eating F
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 10, 2022 | 5:14 PM

Health Tips: ఒకప్పుడు ఇంటిల్లిపాది కలిసి ఒకే చోట నేలపై కూర్చుని భోజనం చేసేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. అప్పటిలా కాకుండా అందరూ డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు, ఇంటిల్లిపాది కలిసి కూర్చుని తినే సమయం కూడా లేకుండా పోయింది. అంతా బిజీబిజీ..ఎవరి టైమ్ వారిది.. ప్రశాంతంగా కలిసి కూర్చుని తినే సమయం అసలే లేకుండా పోయింది. కానీ, అలా డైనింగ్‌ టేబుల్‌పై కూర్చుని తినే అలవాటు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. హాయిగా నేల మీద కూర్చొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అంతేకాదు. ఇలా నేలమీద కూర్చుని తినటం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు పెరగకుండా కంట్రోల్‌ చేస్తుంది.. నేలమీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఊబకాయం దరిచేరదు. నేలపై కూర్చొని తినడం వల్ల శరీరం నిటారుగా ఉంటుంది. దీని వల్ల ఆహారం తిన్నప్పుడు అది నేరుగా జీర్ణాశయం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు ఈజీగా చేరుతుంది. అలాగే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం దృష్టి అంతా కూడా ఆహారంపైనే ఉంటుంది. అందువల్ల మీరు అతిగా తినకుండా ఉంటారు. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది.

ఎముకలకు బలానిస్తుంది.. నేలపై కూర్చొని తినడంలో కాళ్లు అడ్డంగా మడుచుకుని కూర్చునే స్థితిలో ఒక ఆసనం ఏర్పడుతుంది. అది పద్మాసనం భంగిమా..దీంతో వెన్ను నిటారుగా ఉంచడం ద్వారా మనకు తెలియకుండానే యోగి చేసిన లాభం కలుగుతుంది. కింద కూర్చొని తినడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. నేలపై కూర్చొని ఆహారం తినే వారి శరీరం చురుకుగా, సరళంగా ఉంటుంది. ఎముకల బలహీనత కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఇది జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సబస్యలు దూరమవుతాయి. జీర్ణ రసాల నియంత్రణను పెంచుతుంది. ఇది కడుపులో ఆమ్లాన్ని పెంచడంలో సహాయపడే ఉదర కండరాలను కూడా ప్రేరేపిస్తుంది.

మనస్సును రిలాక్స్ చేస్తుంది .. పద్మాసానం ధ్యానానికి అనువైనది..మనస్సును రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంచడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

బంధాలను బలపరుస్తుంది… సాంప్రదాయకంగా భారతీయులు కుటుంబ సమేతంగా కలిసి భోజనం చేస్తారు. ఇది ఒకరికొకరు రోజు ఎలా గడిచిందో తెలుసుకోవడంలో, బంధం ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది. తద్వారా ప్రతి ఒక్కరినీ సంతోషంగా, రిలాక్స్‌గా చేస్తుంది.

ఇష్టమైన ఆహారం తీసుకుంటారు.. మీ కుటుంబంతో కలిసి నేలపై తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని వారితో మరింత దగ్గరగా చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తినేందుకు కూడా ప్రోత్సహిస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు