Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video:  నాగిని డ్యాన్స్‌ చేయమంటే నిజంగానే పాములా మారిపోయాడు.. తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు..

ఇక ఇండియన్‌ స్టైల్‌లో చాలా మంది చేసే డ్యాన్స్‌..నాగిని డ్యాన్స్‌. ఈ డ్యాన్స్‌ పట్ల అభిమానులకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు..

Viral Video:  నాగిని డ్యాన్స్‌ చేయమంటే నిజంగానే పాములా మారిపోయాడు.. తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు..
Snake Dance
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 10, 2022 | 4:30 PM

Viral Video: పార్టీలు, పెళ్లిళ్లు, బారాత్‌ వేడుకలుక సందర్భం ఏదైనా సరే..అక్కడ డీజేలు,డ్యాన్స్‌లతో దుమ్ములేపాల్సిందే.. ఇక ఇండియన్‌ స్టైల్‌లో చాలా మంది చేసే డ్యాన్స్‌..నాగిని డ్యాన్స్‌. ఈ డ్యాన్స్‌ పట్ల అభిమానులకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు..అయితే, ఇప్పుడు మన నాగిని డ్యాన్స్‌ ఖండాంతరాలు దాటుకుంది. ఈ డ్యాన్స్‌లో మంచి రిథమ్‌తో నాగిని మ్యూజిక్‌ ప్లే అవుతుండగా, ఒకరు నోట్లో కర్ఛిఫ్‌ పెట్టుకుని బూరను వాయించినట్టగా తిప్పుతుంటే..మరొకరు..మోకాళిపై కూర్చుని చేతులతో పాము పడగ మాదిరిగా పెట్టుకుని అచ్చం పాము డ్యాన్స్‌ చేస్తున్నట్టుగానే హవభావాలతో నృత్యం చేస్తారు.. మోకాళ్లపై కూర్చుని, నేలపై పడుకుని విభిన్న భంగిమల్లో ఉంటుంది ఈ నాగిని డ్యాన్స్‌. అయితే, ఇక్కడ ఇలాంటి డ్యాన్స్‌ చేస్తున్న ఓ అంకుల్‌ వీడియో బాగా వైరల్‌ అవుతోంది.

ఓ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు నాగిని డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనం చూస్తుండగానే ఆ ఇద్దరు వ్యక్తులు పాములా తలపై చేతులు పెట్టుకుని రక్షక భంగిమలో వలయాకారంలో కదులుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు తమ చేతులను కింగ్ కోబ్రా లాగా తిప్పుతున్నారు. అందులో ఓ వ్యక్తి…కాస్త భారీ శరీరంతో కనిపిస్తున్నాడు. అతను అవతలి వ్యక్తిపై వేపు దూసుకుపోతున్నాడు. అతడు తన హెవీ బాడీని సైతం లెక్క చేయకుండా అమాంతంగా కొన్ని అడుగుల దూరం వరకు ఎగురుతున్నాడు. దాంతో మరొ వ్యక్తి అతని ‘కోబ్రా దాడి కదలిక’ నుండి తప్పించుకోవలసి వచ్చింది. అతను తన చుట్టూ ఉన్న కొంతమందిని కూడా ఆశ్చర్యపరిచాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by BKS ?? (@memes.bks)

ఆ వ్యక్తి నేలపై పడి, దొర్లుతున్నాడు. పాములాగా మళ్లీ మోకాళ్లపైకి లేచాడు. ఎక్కువ దూరం జంప్ చేసినప్పటికీ అతడు ఎలాంటి గాయాల పాలుకాలేదు. కానీ, ఇతడి గెంతులకు అవతలి వ్యక్తి భయపడిపోయాడు.కానీ, అతనితో నాగిన్ గేమ్ ఆడుతూనే ఉంటాడు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘memes.bks’ షేర్‌ చేసారు. వీడియో చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. భిన్నమైన కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి