Anand Mahindra Tweet: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన దృష్టికి వచ్చిన వీడియోస్ ను, స్పూర్తిదాయకమైన ఫోటోస్‌ని షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. సోషల్ మీడియాను తరచూ వినియోగించే ఆనంద్ మహీంద్రా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తక్షణమే స్పందించి వారికి సాయం చేస్తారు. సామాజిక మాధ్యమాల్లో అందరూ తెలుసుకోవాల్సిన విషయం అనిపిస్తే ఆ పోస్టులను రీపోస్ట్ చేస్తూ.. అందరినీ ఆలోచించేలా చేస్తారు. ప్రస్తుతం అలాంటి ఓ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోలో…నీటిలో హాయిగా ప్రయాణిస్తోన్న బాతులను చూడొచ్చు…
వైరల్ అవుతున్న ఈ వీడియోలో..తల్లి బాతుపై ఓ పిల్ల బాతు దర్జాగా కుర్చుని వెళ్తుండగా.. మరికొన్ని పిల్లలు వరుస క్రమంగా వెళ్తున్నాయి. వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. ”ఇండియాలో దీన్ని టికెట్ లెస్ ట్రావెల్ అని అంటారనే క్యాప్షన్‌తో పెట్టారు. దీంతో నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు.
In India, that would be called a TT. Ticketless traveler. pic.twitter.com/bNCQ42zO7W
— anand mahindra (@anandmahindra) September 8, 2022
వీడియో చూడముచ్చటగా ఉందందటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సౌకర్యవంతమైన ప్రయాణం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ అందమైన వీడియోకి మీరు కూడా మీ కామెంట్ చెప్పండి..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి