Viral Video: బాత్రూమ్‌ టబ్‌లో ప్రత్యక్షమైన భారీ కొండచిలువ.. గ్లాస్‌డోర్‌ లేకుంటే ఏం జరిగేదో ఊహించలేం.. వీడియో వైరల్‌

ఓ ఖరీదైన బాత్రూమ్ ఫ్లోర్‌పై 12 అడుగుల పొడవైన భారీ కొండచిలువ పాకుతూ ప్రత్యక్షమైంది. ఆ భయానక వీడియో ఇంటర్‌నెట్‌ని వణికిస్తోంది. అంతే కాదు..

Viral Video: బాత్రూమ్‌ టబ్‌లో ప్రత్యక్షమైన భారీ కొండచిలువ.. గ్లాస్‌డోర్‌ లేకుంటే ఏం జరిగేదో ఊహించలేం.. వీడియో వైరల్‌
Long Python
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 09, 2022 | 8:04 PM

Viral Video: ఓ ఖరీదైన బాత్రూమ్ ఫ్లోర్‌పై 12 అడుగుల పొడవైన భారీ కొండచిలువ పాకుతూ ప్రత్యక్షమైంది. ఆ భయానక వీడియో ఇంటర్‌నెట్‌ని వణికిస్తోంది. అంతే కాదు.. ఆ భారీ కొండచిలువ.. బాత్‌టబ్ చుట్టూ ఉన్న గ్లాసు డోర్‌ వెనుక నుండి ఆ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించింది.. ఆ దృశ్యాలను వారింట్లోని రెండు పెంపుడు పిల్లులు ఆసక్తిగా చూస్తున్నాయి. సెప్టెంబర్ 7 బుధవారం సాయంత్రం బ్యాంకాక్‌లోని ఓ ఇంటి బాత్రూమ్‌లో కనిపింది. 12 అడుగుల పొడవైన పాము..టాయిలెట్ నుండి బయటపడింది. అదృష్టవశాత్తూ.. గ్లాస్‌ డోర్‌ తెరిచిలేకపోవడంతో ఆ పిల్లి పిల్లలు రక్షించబడ్డాయి. ఆ తర్వాత స్నేక్‌ క్యాచర్స్‌, ఫారెస్ట్‌ సిబ్బంది వచ్చి ఆ కొండచిలువను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఓ ప్లాస్టిక్ సంచిలో వేసుకుని తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ న్యూస్ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

థాయ్‌లాండ్‌లోని ఓ ఇంటి బాత్‌రూమ్‌లో కొండచిలువ కలకలం రేపింది. పామును చూసిన వెంటనే ఆ ఇంట్లోని ఫారెస్ట్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ తర్వాత వారింట్లోని పెంపుడు జంతువులకు ఎలాంటి హాని కలుగకుండా వాటిని కాపాడుకున్నారు. తమ రెండు నెలల పిల్లులు కార్బన్, సెన్రివ్ కొండచిలువ వైపు ఎలా చూస్తున్నాయో వారు గమనిస్తూ ఉండిపోయారు. ఇంట్లో ఎవరూ లేకపోతే ఆ పాము తమ పిల్లి పిల్లలు మింగేసి ఉండేది వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ సిబ్బంది పామును బంధించిన తర్వాత కూడా వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.“పాము తిరిగి వస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. తమ ఇంట్లో ఆహారం దొరుకుతుందని, తమ ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులను ఆ పాము పసిగట్టింది అంటూ వారు వణికిపోతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by NowThis (@nowthisnews)

కాగా, ఈ వీడియో నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేసింది. కొందరు నెటిజన్లు వారిని ఇల్లు మారాలని సూచింస్తుంటే..మరికొందరు బాత్‌రూమ్‌ వెళ్లేముందు పదే పదే తనిఖీ చేసుకోండి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి