AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పెళ్లి కొడుకుగా మారిన 102 ఏళ్ల తాత..! అందంగా ముస్తాబై ఊరేగింపుతో బయల్దేరాడు.. కారణం తెలిస్తే సూపర్ అంటారు..

102 ఏళ్ల వృద్ధుడు పెళ్లి కొడుకు వేషంలో ఊరేగింపుతో వీధుల్లో తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వృద్ధుడి వేషం వెనుక ఒక పెద్ద కారణమే ఉంది..

Viral News: పెళ్లి కొడుకుగా మారిన 102 ఏళ్ల తాత..! అందంగా ముస్తాబై ఊరేగింపుతో బయల్దేరాడు.. కారణం తెలిస్తే సూపర్ అంటారు..
Old Man Celebrate
Jyothi Gadda
|

Updated on: Sep 09, 2022 | 6:30 PM

Share

Viral News: హర్యానాలో ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని రోహ్‌తక్‌లో 102 ఏళ్ల వృద్ధుడు పెళ్లి కొడుకు వేషంలో ఊరేగింపుతో వీధుల్లో తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వృద్ధుడి వేషం వెనుక ఒక పెద్ద కారణమే ఉంది..ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా 102 ఏళ్ల బతికున్న వృద్ధుడిని రికార్డుల్లో చనిపోయినట్టుగా నమోదు చేశారు. దాంతో ఆ వ్యక్తికి పెన్షన్ ఆగిపోయింది. ఆరా తీయగా..అసలు విషయం తెలిసింది. దాంతో ప్రభుత్వ అధికారులకి తాను బతికే ఉన్నానని చెప్పాలనుకున్నాడు. దానికోసం పెళ్లికొడుకులా ముస్తాబై.. పెళ్లి ఊరేగింపు తీశాడు. ప్రభుత్వ అధికారులను, ప్రజా ప్రతినిధులను కలసి.. తాను బతికే ఉన్నానని, తనను గుర్తించాలంటూ.. ఆధారాలను అందజేశాడు. తన పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరాడు. ఈ ప్రత్యేక నిరసన తీరు చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఈ 102 ఏళ్ల వృద్ధుడి ఊరేగింపుపై రకరకాల రియాక్షన్లు ఇస్తున్నారు నెటిజన్లు.

102 ఏళ్ల దులీచంద్ అనే వృద్ధుడి ఊరేగింపు వీడియోను రామన్ అనే వినియోగదారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. థారా ఫుఫా ఇంకా బతికే ఉన్నారని వీడియోకు క్యాప్షన్‌లో రాశాడు. హర్యానా ప్రభుత్వం 102 ఏళ్ల వృద్ధుడిని చనిపోయినట్లు ప్రకటించడం ద్వారా వృద్ధాప్య పింఛను నిలిపివేసింది. దీనికి వ్యతిరేకంగా వృద్ధుడు దులీచంద్ పెళ్లికొడుకుగా కట్టుబట్టలతో DC కార్యాలయానికి చేరుకున్నాడు. డాక్యుమెంట్లలో చనిపోయినట్లు ప్రకటించబడిన వృద్ధుడి పేరు దులీచంద్..గత కొన్ని నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తాను బతికే ఉన్నానని నిరూపించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కాబట్టి ఇప్పుడు 102 ఏళ్ల వృద్ధుడు తనను తాను సజీవంగా నిరూపించుకోవడానికి ఇలా వెరైటీ ఊరేగింపు చేపట్టాడు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ102 ఏళ్ల దులీచంద్ ఊరేగింపు వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ వీడియోపై స్పందిస్తూ నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారుడు స్పందిస్తూ.. అధికారుల కళ్లు తెరిపించటానికి ఇది మంచి ఆలోచన అంటూ ట్వీట్ చేశాడు. మీరు కొత్తగా ఏమీ చేయకపోతే మీ సమస్య అలాగే ఉంటుంది. తగిన బుద్ధి చెప్పారు అంటూ నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి