Punjab Murder: ఆలయ సమీపంలో మద్యం సేవించి, పొగాకు నమిలాడని యువకుడిని కత్తులతో పొడిచి చంపేశారు..

రెండు నిమిషాల ఈ వీడియో క్లిప్‌లో..ఇద్దరు నిహాంగ్ సిక్కులు హర్మన్‌జీత్‌తో వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఇంతలో ఒక నిహాంగ్‌ సిక్కు ఒరలో ఉన్న కత్తిని బయటకు తీశాడు. దీంతో..

Punjab Murder: ఆలయ సమీపంలో మద్యం సేవించి, పొగాకు నమిలాడని యువకుడిని కత్తులతో పొడిచి చంపేశారు..
Punjab Murder
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 09, 2022 | 3:23 PM

Punjab Murder: పంజాబ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో 22 ఏళ్ల యువకుడిని ఇద్దరు నిహాంగ్ సిక్కులు నరికి చంపారు. సదరు వ్యక్తి మద్యం తాగి పొగాకు సేవిస్తున్నాడని ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన బుధవారం రాత్రి కహియా వాలా బజార్‌లో జరిగింది. అయితే వ్యక్తిని నరికి చంపుతుండగా, అక్కడి ప్రజలు షాక్‌తో చూస్తుండిపోయారు. బాధితుడు హర్మంజీత్ సింగ్ తీవ్ర గాయాలు, రక్తస్రావంతో రాత్రంతా వీధిలోనే పడి ఉన్నాడు..రక్తస్రావం ఎక్కువగా కావడంతో అతడు మరణించాడు. ఈ ఘటన స్థానిక సీసీటీవీలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రెండు నిమిషాల ఈ వీడియో క్లిప్‌లో..ఇద్దరు నిహాంగ్ సిక్కులు హర్మన్‌జీత్‌తో వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఇంతలో ఒక నిహాంగ్‌ సిక్కు ఒరలో ఉన్న కత్తిని బయటకు తీశాడు. దీంతో హర్మన్‌జీత్‌ సింగ్‌ ప్రతిఘటించాడు. మరో నిహాంగ్‌ సిక్కు కూడా తన వద్ద ఉన్న కత్తిని బయటకు తీసి అతడిపై దాడి చేశాడు. దీంతో హర్మన్‌జీత్‌ సింగ్‌ తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే మూడో వ్యక్తి తన వద్ద ఉన్న డాగర్‌తో హర్మన్‌జీత్‌ సింగ్‌పై దాడి చేశాడు. అనంతరం నిహాంగ్‌ సిక్కులు కూడా కత్తులతో అతన్ని పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా చూస్తున్న ప్రజలు ఏమీ పట్టనట్టుగానే ఉన్నారు తప్ప..ఎవరూ అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడపడి మరణించాడు. ఆ మర్నాడు ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు.

ఇవి కూడా చదవండి

ముగ్గురు నిందితుల్లో ఒకరైన రమణదీప్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగిలిన ఇద్దరు నిహాంగ్‌ సిక్కుల కోసం గాలిస్తున్నట్టుగా చెప్పారు.. కాగా, తన కుమారుడు త్వరలో విదేశాలకు వెళ్లనున్నాడని, ఇంతలో నిహాంగ్‌ సిక్కుల చేతుల్లో హత్యకు గురయ్యాడంటూ హర్మన్‌జీత్‌ సింగ్‌ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ