Queen Elizabeth-2: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతి పట్ల ప్రపంచ దేశాల సంతాపం.. భారత్‌లో ఒక్క రోజు..

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ గురువారం త‌న 92 ఏళ్ల వ‌య‌స్సులో గురువారం మృతి చెందారు. ప్రపంచ దేశాలతోపాటు భారత్ కూడా..

Queen Elizabeth-2: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతి పట్ల ప్రపంచ దేశాల సంతాపం.. భారత్‌లో ఒక్క రోజు..
Queen Elizabeth
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 09, 2022 | 4:01 PM

బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఏడు దశాబ్దాలకు పైగా పాటు ఏకబిగిన పరిపాలించిన క్వీన్‌ ఎలిజబెత్‌ 2(Queen Elizabeth) మరణంతో ఒక శకం ముగిసింది. దశాబ్దాల రాచరిక పాలనలో ఎన్నో మలుపులూ, మరెన్నో అనుభవాలను మూటగట్టుకున్న వృద్ధమాత క్వీన్‌ ఎలిజబెత్‌ టు…బ్రిటన్‌లోని బాల్‌మోరల్‌ కాసిల్‌లో గురువారం కన్నుమూశారు. ప్రపంచ రాచరిక చరిత్రలో అత్యధిక కాలం పాలించిన మహిళల్లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 ప్రథమ స్థానంలో ఉన్నారు… సుదీర్ఘ చారిత్రక రాచరిక ప్రస్థానంలో అత్యధిక కాలం పాలించిన వారిలో రెండోస్థానంలో ఎలిజబెత్‌ టు ఉన్నారు. యూకేతో పాటు డజనుకిపైగా దేశాల సార్వభౌమాధికారాలను తన చెప్పుచేతల్లో ఉంచుకున్న ఏకైక మహిళ కూడా ఎలిజబెత్‌ టుయే.

దీంతో బ్రిటన్‌ చరిత్రలో అంకం ముగిసింది. క్వీన్ ఎలిజబెత్ II గురువారం 96 సంవత్సరాల వయస్సులో మరణించారు. అదే సమయంలో, ఇప్పుడు బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తరువాత భారత్ అంతటా సెప్టెంబర్ 11న ఒక రోజు సంతాప దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అధికారిక వినోదాలు ఉండవు..

దేశవ్యాప్తంగా జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ జెండాను ఎగురవేస్తామని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర సంతాప దినం అధికారిక వినోదం ఉండవు.

ప్రధాని మోదీ సంతాపం..

ఎలిజబెత్ II మరణం పట్ల భారత ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.’ఎలిజబెత్ II మన కాలంలో గొప్ప పాలకురాలిగా గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ఆమె కుటుంబంతోపాటు, బ్రిటన్ ప్రజలు శోక సమయంలో ఉన్నారు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘2015, 2018లో UK సందర్శనల సమయంలో నేను ఆమెను కలిశాను. ఒక సమావేశంలో మహాత్మా గాంధీ తన పెళ్లిలో బహుమతిగా ఇచ్చిన రుమాలును నాకు చూపించారు’ అని ప్రధాని మోదీ అన్నారు.

54 దేశాలలో జాతీయ జెండాలను అవతనం చేయనున్నాయి. బ్రిటన్‌లో మాత్రం 10 నుంచి 12 రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా నిర్ణయించారు.

ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్..

క్వీన్స్ అంత్యక్రియల ఊరేగింపు ప్రణాళికకు గతంలో ‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్’ అని పేరు పెట్టారు. రాణి స్కాట్లాండ్‌లో మరణించినప్పటి నుంచి.. ఇది ‘ఆపరేషన్ యునికార్న్’తో ముడిపడి ఉంది. యునికార్న్ స్కాట్లాండ్ జాతీయ జంతువు. ఆపరేషన్ లండన్ లో భాగంగా బీబీసీ యాంకర్ నల్లటి దుస్తులు ధరించి వార్తను చదివారు. ఇవాళ(శనివారం) బ్రిటన్‌లో ‘డి-డే’ ప్రకటించబడుతుంది. అంత్యక్రియలు జరిగే వరకు ప్రతి రోజు D+1, D+2 గా పరిగణించబడుతుంది.

డ‌బ్బా వాలాల‌ సంతాపం

ఆమె మృతి ప‌ట్ల అనేక రంగాల ప్రముఖుల నుంచి సంతాపం వ్యక్తం అవుతోంది. మ‌హారాష్ట్ర ముంబైలోని డ‌బ్బా వాలాల‌కు ఆమె మృతి ప‌ట్ల విచారం వ్యక్తం చేశారు. సంతాపం తెలిపారు డ‌బ్బా వాలాలు. ముంబై డ‌బ్బాల వాలాల‌కు, క్వీన్ ఎలిజ‌బెత్ కు అనుబంధం ఉంది. ఈ సంద‌ర్భంగా వారు దానిని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని అంతర్జాతీ వార్తల కోసం