Bharat Jodo Yatra: సామాన్య కార్యకర్తలా యాత్రలో పాల్గొంటున్నా.. మరోసారి బీజేపీని టార్గెట్ చేసిన రాహుల్..
Rahul Gandhi on Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తగానే తాను ఈ యాత్రలో పాల్గొంటున్నట్లుగా వెల్లడించారు రాహుల్ గాంధీ.
దేశంలోని క్షేత్రస్థాయిలో పరిణామాల్ని తెలుసుసుకునేందుకు పాదయాత్ర ఓ మంచి ప్రయాణమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చేసిన విధ్వంసం నుంచి దేశాన్ని కాపాడేందుకు ఇదో ప్రయత్నమన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర జోరుగా సాగుతోంది. మడోరోజు పాదయాత్రలో ప్రజలతో మమేకం అయ్యారు రాహుల్. కేంద్ర వైఫల్యాలను ఎండగడుతూ యాత్రను కొనసాగిస్తున్నారు రాహుల్. ప్రజల్ని కలిసేందుకు, కలిపి ఉంచేందుకే ఈ యాత్ర చేపట్టానన్న రాహుల్… దేశాన్ని విభజించేలా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగానే తన పోరాటమన్నారు. అయితే, ఈ యాత్రకు నాయకత్వం వహించడం లేదన్న రాహుల్.. సామాన్య కార్యకర్తగానే పాల్గొంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ భావజాలం నచ్చేవాళ్లంతా ఇందులో పాల్గొనవచ్చన్నారు.
రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్‌ను నింపుతోంది. కన్యాకుమారిలో పాదయాత్ర చేశారు. రాహుల్. స్థానికులు , కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతున్నారు. రోడ్లపై జనాన్ని పలుకరించుకుంటూ ముందుకు కదులుతున్నారు రాహుల్‌గాంధీ.
బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కామరాజ్ ప్రాంతానికి రావడం చాలా గొప్పదని అన్నారు. భారత్ జోడో యాత్రపై బీజేపీ నేతల దాడులపై వారి అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామని రాహుల్ అన్నారు. కాంగ్రెస్‌కి ఇది గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చేసిన నష్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అని విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం