AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghulam Nabi Azad: “నేను ఆ పని చేస్తే వాళ్లు మాయమైపోయేవారు”.. కాంగ్రెస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించిన ఆజాద్

ఇటీవలే కాంగ్రెస్ (Congress) పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్ ఆ సమయంలో పార్టీ పై, రాహుల్ గాంధీ తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా ఆయన మరోసారి కాంగ్రెస్ పై ఇంట్రెస్టింగ్ కాంగ్రెస్‌ తనపై క్షిపణులు..

Ghulam Nabi Azad: నేను ఆ పని చేస్తే వాళ్లు మాయమైపోయేవారు.. కాంగ్రెస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించిన ఆజాద్
Ghulam Nabi Azad
Ganesh Mudavath
|

Updated on: Sep 09, 2022 | 6:13 PM

Share

ఇటీవలే కాంగ్రెస్ (Congress) పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్ ఆ సమయంలో పార్టీ పై, రాహుల్ గాంధీ తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా ఆయన మరోసారి కాంగ్రెస్ పై ఇంట్రెస్టింగ్ కాంగ్రెస్‌ తనపై క్షిపణులు ప్రయోగించిందని, కానీ వాటిని రైఫిల్‌తో అడ్డుకున్నానని చెప్పారు. అదే తాను బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగిస్తే వారు మాయమైపోయేవారని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 52 ఏళ్లు పార్టీలో కొనసాగిన తాను రాజీవ్‌ గాంధీని (Rajiv Gandhi) సోదరుడిలా, ఇందిరా గాంధీని తల్లిగా భావించానని వెల్లడించారు. అందుకే వారి గురించి మాట్లాడలేనని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా గులాం నబీ ఆజాద్ జమ్ములో భారీ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం తాను రక్తం ధారపోస్తే ఇప్పుడు ఆ పార్టీ తమను విస్మరించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో చేరబోనని, సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు గతంలో వెల్లడించారు. జమ్ము-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు, స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలపై తాను పోరాడతానని వివరించారు. తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి ఇప్పటి వరకు పేరును నిర్ణయంచలేదని, జమ్మూ కశ్మీర్‌ ప్రజలే పార్టీ పేరు, పతాకాన్ని నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ కోసం రక్తాన్ని ధారపోశాను. కాంగ్రెస్‌ పార్టీ నాపై క్షిపణులు ప్రయోగించింది. నేను వాటిని రైఫిల్‌తో నాశనం చేశాను. ఒక వేళ నేను బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉంటే వారు అదృశ్యమయ్యేవారు. కానీ నేను 303 రైఫిల్‌తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నా. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను. ఇందిరా గాంధీని తల్లిగా, రాజీవ్‌ గాంధీని సోదరుడిగా భావించాను.

ఇవి కూడా చదవండి

– గులాం నబీ ఆజాద్, కేంద్ర మాజీ మంత్రి

కాగా.. కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ ప్రకటన విడుదల చేశారు. పార్టీ విధానాలు, అంతర్గత వ్యవహారాల గురించి పలుసార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించిన ఆజాద్.. తాజాగా రాహుల్ గాంధీ తీరును కూడా తప్పుబట్టారు. రాహుల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైందని పేర్కొన్నారు. సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీది చిన్న పిల్లల మనస్తత్వం అని, ఈ పరిస్థితికి రాహుల్ కారణమని పేర్కొన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకోవడం బాధేస్తుందంటూ ఆజాద్ పేర్కొన్నారు. ఈ మేరకు తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ మొత్తం ఐదు పేజీల లేఖను సోనియాకు పంపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి