Crime News: పెంపుడు కుక్క బీభత్సం.. పార్కుకి వెళ్లిన బాలుడిపై దాడి.. మొహంపై ఏకంగా 200 కుట్లు..
Pit Bull Dog Attack on Child: పిట్ బుల్ జాతికి చెందిన కుక్క 11 ఏళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి మొహానికి 200 కుట్లు పడ్డాయి.
Pit Bull Dog Attack on Child: పిట్ బుల్ జాతికి చెందిన కుక్క 11 ఏళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి మొహానికి 200 కుట్లు పడ్డాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గత వారం ఘజియాబాద్‌లోని తన ఇంటి సమీపంలోని పార్కులో ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలుడిపై పెంపుడు పిట్ బుల్ కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి ముఖానికి దాదాపు 200 కుట్లు పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన సన్నివేశం అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కుక్క బాలుడిపై తీవ్రంగా విరుచుకుపడటం కనిపించింది. ఓ బాలిక కుక్కను తీసుకొని పార్కులో నడుస్తుండగా.. అకస్మాత్తుగా పిల్లవాడిపై దాడి చేసింది. ఈ సమయంలో ఒక వ్యక్తి పరుగున వచ్చి పిల్లవాడిని రక్షించాడు. అప్పటికే.. పిల్లవాడు పుష్ప్ త్యాగి ముఖంలోని కొంత భాగాన్ని కుక్క కొరికేసినట్లు స్థానికులు వెల్లడించారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు.
ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా జంతువును ఉంచిన కుక్క యజమానికి రూ. 5,000 జరిమానా విధించారు. సెప్టెంబరు 3న జరిగిన దాడి తర్వాత స్థానికులు యజమానిపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి వెళ్లే పార్కుల వద్ద జంతువులను విడిచిపెట్టడం సరికాదంటూ పేర్కొంటున్నారు. కాగా.. యూపీలో పెంపుడు కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల పెంపుడు కుక్కల దాడికి సంబంధించిన రెండు దిగ్భ్రాంతికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జూలైలో పిట్ బుల్ జాతికి చెందిన కుక్క యజమానిని చంపింది. ఈ ఘటన తర్వాత ఘజియాబాద్, నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లిఫ్ట్‌లలో కుక్కలు దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి