AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని మీరెప్పుడైనా లైవ్‌లో చూశారా..? ఈ వీడియో చూస్తే గుండె ఝల్లుమంటుంది..

ముంబై నగరంలో పిడుగు పడుతున్న దృశ్యం నెట్టింట వైరల్ అయింది. ఓ భవనంపై పిడుగు పడుతుండగా.. ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Viral Video: అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని మీరెప్పుడైనా లైవ్‌లో చూశారా..? ఈ వీడియో చూస్తే గుండె ఝల్లుమంటుంది..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Sep 09, 2022 | 12:57 PM

Share

Lightning Strikes Viral Video: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నగరాలు జలమయంగా మారాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 30.96 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ముంబై నగరంలో పిడుగు పడుతున్న దృశ్యం నెట్టింట వైరల్ అయింది. ఓ భవనంపై పిడుగు పడుతుండగా.. ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు భయానకంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అయిన వీడియో.. ముంబైలోని బోరివలి వెస్ట్ ప్రాంతానికి చెందినది. దీనిలో పిడుగు పడుతుండటాన్ని చూడవచ్చు. ఇది బోల్ట్ నేమినాథ్ బిల్డింగ్‌ను నేరుగా తాకింది. అయితే.. పిడుగుపాటు వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సన్నివేశం భయానకంగా ఉందని.. అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం జరగలేదని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన యూజర్ పేర్కొన్నాడు. ఎనిమిది సెకన్ల వీడియోలో పెద్ద శబ్దంతో భవనంపై పిడుగు పడుతుండటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో ఆ ప్రాంతంలోని మరో భవనం నుంచి వీడియో తీశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

కెమెరా పట్టుకున్న వ్యక్తి పిడుగు పడే సమయంలో వణుకుతూ కనిపించాడు. కాగా.. ముంబై నగరంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..