Horoscope Today: ఈ రాశుల వారు గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది

Horoscope Today: రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే రాశిఫలాలను తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉంటుంది..? అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను..

Horoscope Today: ఈ రాశుల వారు గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది
Horoscope Today
Follow us
Subhash Goud

|

Updated on: Sep 09, 2022 | 7:28 AM

Horoscope Today: రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే రాశిఫలాలను తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉంటుంది..? అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను చాలా మంది తెలుసుకుంటారు. భారతీయ సంప్రదాయంలో చాలా మంది జ్యోతిష్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక సెప్టెంబర్‌ 9న వివిధ వర్గాల వారి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

మేషరాశి: విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళిక వేస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. కొన్ని విషయాలలో నిర్ణయలు తీసుకునేముందు బంధుమిత్రులను సంప్రదించాలి.

వృషభ రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు. కొందరి ప్రవర్తన వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు.

మిథున రాశి: మొదలు పెట్టిన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహాలు పొందడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి: నిర్లక్ష్యం వహిస్తే చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది.

సింహరాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

కన్య రాశి: చేపట్టే పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.

తుల రాశి: ఆర్థికంగా ముందుకు సాగుతారు. కొత్త పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి.

వృశ్చిక రాశి: ఈ రాశుల వారు గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. పెద్దల నుంచి గౌరవం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనుస్సు రాశి: కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఒత్తిడి పెరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరుగకుండా చూసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది.

మకర రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపారుల్లో మీ అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. సకాలంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

కుంభ రాశి: తెలివిగా వ్యవహరిస్తే అనుకున్నవి సాధిస్తారు. కీలక వ్యవహారంలో పెద్దలు సలహాలు, సూచనలు అవసరం. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

మీన రాశి: కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. భవిష్యత్తు ప్రణాళిక వేస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.