Facebook Saved Student: ఆత్మహత్య చేసుకోబోయిన నీట్‌ అభ్యర్థి..ఫేస్‌బుక్‌ అలర్ట్‌తో రంగంలోకి పోలీసులు.. సీన్ కట్ చేస్తే..

అలాంటి సందేశాలు పోస్ట్ చేసే వారి ప్రాణాలను కాపాడాలని పోలీసులందరినీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు త్వరగా ప్రతిస్పందించడానికి Facebook తో ఒప్పందం చేసుకున్నట్టు ఆయన వివరించారు.

Facebook Saved Student: ఆత్మహత్య చేసుకోబోయిన నీట్‌ అభ్యర్థి..ఫేస్‌బుక్‌ అలర్ట్‌తో రంగంలోకి పోలీసులు.. సీన్ కట్ చేస్తే..
Police Rent Row
Follow us

|

Updated on: Sep 09, 2022 | 6:04 PM

Facebook Saved Student: అభివృద్ది చెందిన టెక్నాలజీ మానవులకు అనేక సందర్భాల్లో వరంగా మారుతుంది. అది మరో ఇక్కడ నిరూపితమైంది. విషం తాగి బలవన్మరణానికి పాల్పడిన నీట్‌ అభ్యర్థి ప్రాణాలు ఫేస్‌బుక్‌ సాయంతో కాపాడడమే ఇందుకు ఉదాహరణ. లక్నోలోని డిజిపి ప్రధాన కార్యాలయంలోని సోషల్ మీడియా సెంటర్‌కు ఫేస్‌బుక్ ఒక SOSను పంపింది..అందులో లక్నోలో నీట్‌ అభ్యర్థి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నీట్‌ అభ్యర్థి ప్రాణాలను కాపాడారు. ఫేస్‌బుక్‌ అలర్ట్‌తో అప్రమత్తమైన యంత్రాంగం..ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి విలువైన ప్రాణాలను రక్షించారు. ఇందులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఫేస్‌బుక్ అలర్ట్‌పై అత్యంత చాకచక్యంగా వ్యవహరించారనే చెప్పాలి.

అదనపు సీపీ (పశ్చిమ) చిరంజీవ్ నాథ్ సిన్హా తెలిపిన వివరాల మేరకు.. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని భావించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 29 ఏళ్ల నీట్ అభ్యర్థి ఇంటికి చేరుకుని అతన్ని సురక్షితంగా రక్షించారు. తాను తప్పు చేశానని, ఇకపై అలా చేయనని చెప్పేలా అతడికి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. ఈ మేరకు లక్నో పోలీసులు, ఫేస్‌బుక్‌ మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. అదేంటంటే..

యూపీ పోలీసులకు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌కు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేస్తే.. సంబంధిత సైట్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు హెచ్చరిక జారీ చేస్తుంది మరియు వెంటనే సహాయం అందించబడుతుంది. వెంటనే లక్నో పోలీస్ కమిషనరేట్‌కు సమాచారం పంపామని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులపై తక్షణమే స్పందించాలని..

ఇవి కూడా చదవండి

అలాంటి సందేశాలు పోస్ట్ చేసే వారి ప్రాణాలను కాపాడాలని పోలీసులందరినీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు త్వరగా ప్రతిస్పందించడానికి Facebook తో ఒప్పందం చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఆత్మహత్య గురించి ఎవరైనా సందేశం పంపితే, ఫేస్‌బుక్ యూపీ పోలీసులకు హెచ్చరిక పంపుతుందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు చాలా మంది ప్రాణాలను కాపాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..