Viral: ఇదేం ఫైన్ మావ.. చలాన్ చూసి స్టన్ అయిన వాహనదారుడు.. పాపం కదా..!
కొన్నిసార్లు పోలీసులు ఆలోచించకుండా చేసే పనులు వారిని చిక్కుల్లో పడేస్తాయి. తాజాగా కేరళలో ఓ వింత ఫైన్ వేసి.. నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు.
Trending: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ట్రాఫిక్ పోలీసులు ఫైన్స్ విధిస్తారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడ్, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్… ఇలా చాలా రకాల ఫైన్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే పోలీసులు వేసే ఫైన్స్ కొన్నిసార్లు భలే వింతగా ఉంటాయి. కార్లో వెళ్తోన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని.. బండిలో సరిపడనంత పెట్రోల్ లేదని జరిమానా వేసిన ఘటనలు మనం చూశాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. కాలుష్య రహిత ఏథర్ 450X బైక్‌కు ఫైన్ వేశారు. అది కూడా పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని. ఆకుపచ్చ లైసెన్స్ ప్లేట్ కనిపిస్తూనే ఉంది. పైగా ఆ బైక్ ఉద్గారాలను విడుదల చేయదని కూడా తెల్సు. ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా జరిమానా వడ్డించేశారు. కేరళ(Kerala)లోని మలప్పురంలోని నీలంచెరిలో సెప్టెంబర్ 6న ఈ ఘటన చోటుచేసుకుంది. మోటారు వాహనాల చట్టం , 1988 లోని సెక్షన్ 213(5)(ఇ) కింద జరిమానా వేసినట్లు తెలిపారు. ఈ నిబంధన ఉల్లంఘించినందుకు బైక్ రైడర్‌కు రూ. 250 ఫైన్ వేశారు. ప్రజంట్ ఆ ఫైన్ రిసిప్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పోలీస్ బాబాయ్‌లకి టార్గెట్ ఉన్నట్లుంది. అందుకే కనిపించిన ప్రతి వాహనానికి ఫైన్ వేస్తున్నారు’.. ‘ నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఫైన్లు వేసేలా ఉన్నారుగా ఈ పోలీసులు’ అని నెటిజన్స్ సెటైరికల్ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి