AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆహారం కోసం వెదుకుతూ కారు లోపలికి ప్రవేశించిన ఎలుగుబంటి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సాధారణంగా ఎలుగుబంట్లు అడవిలో లేదా జూలో చూసి ఉంటారు. అవి మాంసాహారులు కాబట్టి ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతుంటాయి. సింహాలు, పులులను కూడా ఎదుర్కొనే శక్తి కూడా వీటికి ఉంటుంది.

Viral Video: ఆహారం కోసం వెదుకుతూ కారు లోపలికి ప్రవేశించిన ఎలుగుబంటి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Bear
Basha Shek
|

Updated on: Sep 09, 2022 | 7:47 PM

Share

సాధారణంగా ఎలుగుబంట్లు అడవిలో లేదా జూలో చూసి ఉంటారు. అవి మాంసాహారులు కాబట్టి ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతుంటాయి. సింహాలు, పులులను కూడా ఎదుర్కొనే శక్తి కూడా వీటికి ఉంటుంది. అలాగే జింకలు, గేదెలు, గుర్రాలు తదితర జంతువులను తమ ఆహారంగా చేసుకుంటుంటాయి. ఎలుగుబంట్లు తరచుగా అడవులలో మాత్రమే కనిపించినప్పటికీ కొన్నిసార్లు అవి ఆహారం కోసం జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. ఇటీవల కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా అవి చొరబడ్డాయి. వాటి వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటి వీడియో మరొకటి నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది.

ఎలుగుబంట్లు చాలా తెలివైన జంతువులు. అది ఈ వీడియోతో మరోసారి నిరూపితమైంది. ఇందులో ఆహారం కోసం వెదుకుతూ జనావాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి కారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే కార్‌ డోర్‌ లాక్‌ చేసి ఉంటుంది. అయినా దానిని తెరిచి లోపలికి ప్రయత్నిస్తుంది. అయితే దాని దురదృష్టం.. కారులో తినడానికి ఏమీ దొరకకదు. దీంతో చేసేదేమి లేక సైలెంట్‌గా బయటకు వస్తుంది. కారుకు కూడా ఎలాంటి నష్టం కలిగించదు. అమెరికాలోని కొలరాడోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఎలుగుబంట్లు మానవ నివాసాలలో సంచరించడం సర్వసాధారణం. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌లో OutThere Colorado అనే IDతో షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎలుగుబంటి కారు నుండి బయటకు వచ్చిన తర్వాత డోర్ లాక్ చేయడం మర్చిపోయిందని ఒక యూజర్‌ సరదాగా కామెంట్‌ పెట్టగా.. మరొక నెటిజన్‌ ఈ వీడియో నా కారు డోర్ లాక్ చేయాల్సిన అవసరం ఉందని నాకు మళ్లీ గుర్తు చేసింది అని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..