Ganesh Chaturthi: మొదటి సారిగా గణపతి గంగమ్మ ఒడిలో ఎలా చేరుకున్నాడో తెలుసా.. ఫోటో సోషల్ మీడియాలో వైరల్..
గణేష్ చతుర్థి పండుగ ఒక సాంస్కృతిక పర్వదినంగా మారడానికి ముందు.. ఈ వేడుకను ఎలా నిర్వహించారు.. గణపతి విగ్రహాన్ని ఎలా ఊరేగిస్తూ నిమజ్జనం కోసం తీసుకెళ్లారో తెలియజేస్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Ganesh Chaturthi: దేశ వ్యాప్తంగా అంగరంగ వైభంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించారు.. 10 రోజుల పాటు భక్తులతో పూజలను అందుకున్న గణపతి గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అనేక రకరకాల వినాయక ప్రతిమలు.. భిన్న సైజుల్లో విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. గణేష్ మహారాజ్ కు జై అంటూ.. అందంగా అలంకరించిన వాహనాలపై గణపతి విగ్రహాన్ని పెట్టి ఊరేగిస్తూ గంగమ్మ ఒడ్డుకి చేరుస్తున్నారు. అయితే గణేషోత్సవం లేదా గణేష్ చతుర్థి పండుగ ఒక సాంస్కృతిక పర్వదినంగా మారడానికి ముందు.. ఈ వేడుకను ఎలా నిర్వహించారు.. గణపతి విగ్రహాన్ని ఎలా ఊరేగిస్తూ నిమజ్జనం కోసం తీసుకెళ్లారో తెలియజేస్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ వినాయక చవితి పండగ మూలాలను మహారాష్ట్రలో గుర్తించారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుండి గణేష్ చతుర్థి సాంప్రదాయకంగా పూణేలో జరుపుకున్నారు. విఘ్నేశ్వరుడు పేష్వాల కులదేవత. వారి పతనంతో పండుగ రాష్ట్ర ప్రోత్సాహాన్ని కోల్పోయింది. అనంతరం మహారాష్ట్రలో ఒక ప్రైవేట్ కుటుంబ వేడుకగా మారింది. అయితే భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు , సంఘ సంస్కర్త లోకమాన్య తిలక్ వినాయక చవితి వేడులను పునరుద్ధరించారు.
గణేష్ చతుర్థి వేడుకలు మండపాలను ఏర్పాటు చేసి జరుపుకునే విధానం 1892లో ప్రవేశపెట్టబడింది, కృష్ణజిపంత్ ఖాస్గివాలే అనే పూణే నివాసి మరాఠా పాలనలో ఉన్న గ్వాలియర్‌ను సందర్శించినప్పుడు.. అక్కడ అతను సాంప్రదాయ బహిరంగ వేడుకను చూసి, దానిని తన స్నేహితులైన భౌసాహెబ్ లక్ష్మణ్ జావలే మరియు బాలాసాహెబ్ నాటు దృష్టికి తీసుకువచ్చాడు. పూణే. భావు రంగరి అని కూడా పిలువబడే జావలే దీనిని అనుసరించి మొదటిసారి వీధిలో మండపాన్ని ఏర్పాటు చేసి గణేశ విగ్రహాన్ని స్థాపించాడు.
లోకమాన్య తిలక్ 1893లో తన వార్తాపత్రిక కేసరిలో ఒక వ్యాసంలో జావలే కృషిని ప్రశంసించారు. నెక్స్ట్ ఏడాది వార్తా ప్రచురణ ఆఫీసు లో గణేశ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. వార్షిక దేశీయ పండుగను ఘనంగా నిర్వహించే బహిరంగ కార్యక్రమంగా మార్చారు. వినాయకుని భారీ విగ్రహాలను మండపాలలో ప్రతిష్టించిన మొదటి వ్యక్తి తిలక్.. అనంతరం పూజను నిర్వహించి.. పదవ రోజున విగ్రహాలను నదులు, సముద్రం లేదా ఇతర నీటి వనరులలో నిమజ్జనం చేసే పద్ధతిని స్థాపించారు.
గణేష్ చతుర్థి లేదా గణేషోత్సవ్ బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా అన్ని కులాలు, వర్గాల ప్రజల సమావేశ స్థలంగా మారింది. ఈ ఉత్సవం మేధోపరమైన ఉపన్యాసం, కవితా పఠనాలు, నాటకాలు, కచేరీలు , జానపద నృత్యాల రూపాల్లో సమాజ భాగస్వామ్యాన్ని సులభతరం చేసింది.
తిలక్ వినాయకుడి విజ్ఞప్తి దేశ వ్యాప్తంగా ప్రజలను కదిలించింది. “అందరికీ దేవుడు”గా గణేష్ చతుర్థిని జాతీయ పండుగగా ప్రాచుర్యం పొందింది. బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకించడానికి మహారాష్ట్ర ప్రజల సహా దేశ వ్యాప్తంగా జాతీయవాద ఉద్వేగాన్ని సృష్టించాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..