Horoscope Today: వీరికి చంద్రబలం అనుకూలం.. ధన, వస్త్ర లాభాలు ఉంటాయి.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today: ఈరాశివారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.
మేషం ఈరాశివారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దైవారాదన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.
వృషభం పనుల్లో ఆటంకాలు ఎదురువతాయి. బంధువులు, కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను దూరంగా ఉంచుకోవాలి . ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.
మిథునం మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. అనవసర ప్రయాణాలు, ఖర్చులు పెరుగుతాయి. వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే మంచిది.
కర్కాటకం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లాభిస్తుంది.వీరికి చంద్రబలం అనుకూలంగా లేదు. ఖర్చులు పెరుగుతాయి. చంద్ర ధ్యానంతో సానుకూల ఫలితాలు పొందుతారు.
సింహం చేపట్టిన పనులు పూర్తవ్వాలంటే శ్రమ తప్పదు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మంచిది.
కన్య సకాలంలో పనులు పూర్తిచేయాలంటే శ్రమ తప్పదు. కీలక పనుల్లో పెద్దల సహకారం అందుతుంది. అనవసర గొడవలకు దూరంగా ఉండాలి. లక్ష్మీ గణపతి స్వామిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.
తుల కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. కొందరి వల్ల చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. అప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శివారాధన ఉత్తమం.
వృశ్చికం మనోధైర్యంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అనూకూల. ఇష్టులతో సమయం గడుపుతారు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. చంద్ర ధ్యానంతో మంచి ఫలితాలు పొందుతారు.
ధనస్సు ఇన్నాళ్ల పాటు మీకు అనుకూలంగా ఉన్న వాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశముంది. తోటి వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించాలి. అష్టలక్ష్మీస్తోత్రం పఠించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
మకరం చేపట్టిన పనులు సకాలంలో నెరవేరుతాయి.ఇష్టమైన వారితో సంతోషాన్ని పంచుకుంటారు. ధన, వస్త్ర లాభం ఉటుంది. సూర్య నమస్కారాలతో మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.
కుంభం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో సత్ఫలితాలు పొందుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. మంచి పనులతో అందరి ప్రశంసలను అందుకుంటారు. విష్ణుదేవుడిని పూజిస్తే మేలు జరుగుతుంది.
మీనం కొన్ని సంఘటనలు మనసుకు విచారం కలిగిస్తాయి. ఆత్మీయుల సహకారం అందుతుంది. మంచి పనులకు శ్రీకారం చుడతారు. గురు, చంద్ర ధ్యానం మంచిది.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.