Maha Lakshmi Yoga: కుజుడు చంద్రుడి కలయిక.. ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం.. అదృష్టం ఈ రాశుల సొంతం..
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు, 12 రాశులకు, 27 నక్షత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు గ్రహాల సంచారం, రాశుల్లో గ్రహాల సంయోగం వలన మొత్తం రాశులపై మంచి, చెడుల ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గ్రహాల సంచారం వలన ప్రతి ఒక్కరి జీవితాలు ప్రభావితం అవుతాయి. అయితే ఏప్రిల్ నెలలో కొన్ని ముఖ్య గ్రహాలు ఒకే రాశిలో కలవనున్నాయి. ఈ సంయోగం వలన కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పటికే కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో చంద్ర సంచారం జరగనుంది. దీంతో మహా లక్ష్మి యోగం ఏర్పడింది.

ఏప్రిల్ నెలలో కుజుడు తన రాశిని మార్చుకుని కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ఇదే రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. దీంతో కర్కాటక రాశిలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. చంద్రుడు ఏ రాశిలోకి వెళ్ళినా అక్కడ రెండున్నర రోజులు ఉంటాడు. దీంతో కర్కాటక రాశిలో కుజుడు, చంద్రుడు సంయోగంతో మహాలక్ష్మి రాజ యోగం ఏర్పడింది. ఈ మహాలక్ష్మి రాజయోగం వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఏది పట్టినా బంగారం అవుతుంది. మహార్జాతకులు అవుతారు. ఈ రెండున్నర రోజులు వీరు ఏది మొదలు పెట్టినా విజయవంతం అవుతుంది. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.
కన్యా రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రెండు రోజులు వీరు ఏ పని మొదలు పెట్టినా విజయాన్ని సాధిస్తారు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కష్టపడి పనిచేసే వారికి కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహాలక్ష్మి రాజయోగం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది.
తులారాశి: వీరికి కూడా మహాలక్ష్మి రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు మంచి విజయాన్ని అందుకుంటారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది శుభ సమయం. ఉగ్యోస్తులకు తమ ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. జీవితంలో సంతోషంగా ఉంటారు.
మకర రాశి: ఈ రాశి వారికీ కూడా ఈ రాజ యోగం వలన శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ రాశికి చెందిన వృత్తి, వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేసిన పనికి తగిన గుర్తింపుని సొంతం చేసుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు