AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: కోరి చేసుకున్నా భర్తని భార్య ఎందుకు మోసం చేస్తుందో తెలుసా.. మగాళ్లూ.. అవి ఏమిటో తెలుసుకోండి

గత కొన్ని రోజుల నుంచి భర్త భర్తల మధ్య వివాదాలు ఏర్పడం.. ప్రియుడి కోసం భర్తని హత్య చేసిన భార్యకు సంబంధించిన వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా వైవాహిక జీవితంలో ఇటువంటి ద్రోహం కేసులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. భార్య తన భర్తను ఎందుకు మోసం చేస్తుందో తెలుసా? దీని గురించి కొన్ని ఆసక్తికరమైన సమాచారం గురించి తెలుసుకుందాం..

Relationship Tips: కోరి చేసుకున్నా భర్తని భార్య ఎందుకు మోసం చేస్తుందో తెలుసా.. మగాళ్లూ.. అవి ఏమిటో తెలుసుకోండి
Relationship Tips
Surya Kala
|

Updated on: Apr 07, 2025 | 7:16 PM

Share

భార్యాభర్తల సంబంధం ఏడు జన్మల బంధం అని ఒక నమ్మకం. ఈ బంధం ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, ప్రేమ ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. అయితే ఇటీవలి రోజుల్లో, విడాకుల కేసులు పెరగడం, భర్తలు భార్యలను మోసం చేయడం, భార్యలు భర్తలను మోసం చేయడం, భార్య వేధింపులు వంటి వార్తలు విన్న తర్వాత పెళ్లికాని వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి వెనుకాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక వివాహిత తన ప్రియుడి కోసం తన భర్తను చంపి డ్రమ్ములో సిమెంట్ తో కప్పిన షాకింగ్ సంఘటన జరిగింది. వివాహేతర సంబంధాల కారణంగా భార్య తన భర్తను మోసం చేసి, తప్పుడు కేసు నమోదు చేసి విడాకులు పొందిన సంఘటనలు చాలా ఉన్నాయి. అన్నింటికంటే వివాహం తర్వాత భార్య తన భర్తను ఎందుకు మోసం చేస్తుందో మీకు తెలుసా? దీని గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం..

ఇది పరిశోధనలో కూడా వెల్లడైంది:

అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలోని నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ 2022లో నిర్వహించిన గ్లోబల్ సోషల్ సర్వేలో 20 శాతం మంది పురుషులు, 13 శాతం మంది మహిళలు తమ భాగస్వాములను మోసం చేస్తున్నారని తేలింది.

వివాహిత స్త్రీలు తమ భర్తలను ఎందుకు మోసం చేస్తున్నారంటే

ఒంటరితనాన్ని అధిగమించడానికి:

పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ భావోద్వేగం గల వ్యక్తులని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా తమ భాగస్వామి తమ పట్ల శ్రద్ధ చూపనప్పుడు లేదా దూరంగా ఉన్నప్పుడు, తీవ్రమైన ఒంటరితనం లేదా భావోద్వేగ నిర్లిప్తత కారణంగా వారు మరొక వ్యక్తితో ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండాలని నిర్ణయించుకుంటారు. దీని కారణంగా వీరు తమ భాగస్వామిని మోసం చేసి వేరొకరితో జీవించడం ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి

భావోద్వేగ అవసరాలను తీర్చడానికి:

తమ భాగస్వాములను మోసం చేసే స్త్రీలు తమ భావోద్వేగ అవసరాలను తీర్చుకోవడానికి భర్తలను మోసం చేస్తారని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. ఇందులో శారీరక, భావోద్వేగ అంశాలు రెండూ ఉంటాయి. భర్త కాకుండా ఆమెతో వేరే వ్యక్తి గౌరవం చూపిస్తూ, కరుణతో చేసిన ప్రతి పనిని ప్రశంసస్తూ మాట్లాడినా, లేదా ఆమెకు తన భర్త నుంచి అవసరమైన భావోద్వేగ మద్దతు లభించకపోయినా.. ఆ భార్య మనస్సు వేరొక వ్యక్తి వైపు మళ్లే అవకాశం ఉంది.

భర్త మీద కోపంతో లేదా ప్రతీకారంతో

చాలా మంది మహిళలు తమ భర్తపై కోపంతో లేదా ప్రతీకారంతో మరొక పురుషుడితో సంబంధాన్ని పెట్టుకుంటారు. అవును భాగస్వామి తమ అంచనాలకు తగ్గట్టుగా జీవించడంలో విఫలమైనప్పుడు లేదా మరేదైనా కారణం వల్ల సంబంధంలో చీలిక ఏర్పడినప్పుడు, లేదా తమ భర్త అనైతిక సంబంధం కలిగి ఉన్నాడని తెలుసుకున్నప్పుడు, కొంతమంది మహిళలు కోపంతో తమ భర్తను మోసం చేస్తున్నాడని.. తప్పుని తప్పుతోనే గుణ పాటం చెప్పాలని తప్పుడు చర్యలకు పాల్పడతారు.

దీనితో పాటు గృహ హింస, భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం, భార్యపై భర్త తగినంత శ్రద్ధ చూపకపోవడం, ప్రేమ లేకపోవడం, ఒంటరితనం, పిల్లల పట్ల బాధ్యత, శారీరక సంబంధంలో అసంతృప్తి.. భావోద్వేగ సంబంధం లేకపోవడం వంటి కారణాల వల్ల భార్య తన భర్తను మోసం చేసే అవకాశం ఉందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)