Salt Consumption: ఉప్పు ఈ పదార్ధాలతో కలుపుకుని తింటే ఆరోగ్యానికి ముప్పే.. అవి ఏమిటంటే
ఆరు రుచుల్లో ఉప్పు ఒకటి. ఆహార రుచిని పెంచడానికి ఉప్పును ఉపయోగిస్తారు. అయితే అధిక ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. అయితే కొన్ని రకాల పదార్థాలకు ఉప్పుని జల్లి తినొద్దు.. ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఉప్పు లేని ఆహారం రుచిగా ఉండదు. ఉప్పు ఆహార రుచిని పెంచడమే కాదు శరీరంలో అయోడిన్ లోపాన్ని నివారిస్తుంది. కొంతమందికి ఉప్పు ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం. పోషకాల లోపం ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లే.. శరీరంలో వాటి పరిమాణం పెరగడం కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ప్రజలు తాము తినే ప్రతిదానికీ ఉప్పుని జత చేయడానికి ఇష్టపడతారని డైటీషియన్ మోహిని డోంగ్రే అంటున్నారు. అయితే కొన్ని పదార్థాలకు ఉప్పు కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం కావచ్చుని డైటీషియన్ హెచ్చరిస్తున్నారు. ఈ రోజు ఆ ఆహార పదార్ధాలు ఏమిటో తెల్సుకుందాం..
పండ్ల రసంలో
ప్రజలు తరచుగా చెరకు, నిమ్మరసంలో ఉప్పు కలుపుకుని త్రాగడానికి ఇష్టపడతారు. అయితే ఇలా చెరకు రసం లేదా నిమ్మ రసంలో ఉప్పు వేసి తాగడం వల్ల వాటిలోని పోషకాలను పొందలేరు. జ్యూస్‌లో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలో ఉప్పు తీసుకోవడం పెరుగుతుంది. ముఖ్యంగా పండ్ల రసానికి ఉప్పు కలిపి తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రూట్ చాట్
ఫ్రూట్ చాట్ అనేది చాట్ మసాలాలు వివిధ పండ్లను కలిపి తయారు చేసే తీపి, కారం రుచితో ఉండే సలాడ్. అయితే ఈ ఫ్రూట్ చాట్ లో ఉప్పు కలిపి తినకూడదని నిపుణులు అంటున్నారు. మీరు పండ్లపై ఉప్పు చల్లి తింటే.. శరీరంలో నీటి నిలుపుదల సమస్య ఏర్పవచ్చు. దీని వల్ల శరీరంలో మంట వస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తపోటు సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో ఉప్పు చల్లుకుని ఎటువంటి పండ్లను తినవద్దు.
సలాడ్
సలాడ్లలో అనేక రకాలు ఉన్నాయి. కూరగాయలు, పండ్లు, లేదా ఇతర పదార్థాలను కలిపి చేసిన ఒక వంటకం. దీనిని చాలా మంది ఉప్పు వేసి తినడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు శరీరంలో సోడియం స్థాయిని పెంచుతుంది. సలాడ్ తినడం వల్ల శరీరానికి ఫైబర్, నీటి శాతం లభిస్తుంది. సలాడ్‌లో ఉప్పు కలిపి తినడం వల్ల నీరు నిలుపుకునే సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా పచ్చి కూరగాయలకు ఉప్పు కలిపి తినవద్దు.
పరిమిత పరిమాణంలో ఉప్పు తీసుకోవడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే చిప్స్, నూడుల్స్, ఇతర జంక్ ఫుడ్స్‌లో అధిక మొత్తంలో సోడియం ఉంటుందని.. వాటిని తినకపోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..