AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలో ప్రోటీన్ లోపాన్ని ఎలా గుర్తించాలి..? తక్కువైతే ఏమౌతుంది..?

ప్రోటీన్ అనేది మన శరీరానికి అత్యంత అవసరమైన ముఖ్య పోషక పదార్థాలలో ఒకటి. ఇది కండరాల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తి, శక్తి ఉత్పత్తి, ఎంజైమ్‌లు తయారీ వంటి అనేక కీలక శారీరక విధులలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం ప్రతిరోజూ తినే ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే.. శరీరంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. వాటిని ముందుగా గుర్తించి సరైన ఆహారంతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

శరీరంలో ప్రోటీన్ లోపాన్ని ఎలా గుర్తించాలి..? తక్కువైతే ఏమౌతుంది..?
Protein
Prashanthi V
|

Updated on: Apr 07, 2025 | 4:02 PM

Share

ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు శరీరం తక్షణ శక్తిని పొందలేకపోతుంది. దీంతో వ్యక్తి రోజంతా నీరసం, అలసటతో బాధపడతాడు. చిన్న పనులు చేసినా గానీ శరీరం బలహీనంగా అనిపిస్తుంది. ఇది దీర్ఘకాలంగా కొనసాగితే జీవనశైలి మీద ప్రభావం చూపుతుంది.

ప్రోటీన్ లోపం వల్ల మొదట కనిపించే సమస్యలలో జుట్టు రాలడం ఒకటి. ప్రోటీన్ జుట్టు ఆరోగ్యానికి అత్యంత అవసరం. తగినంత ప్రోటీన్ లేకపోతే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే విధంగా చర్మం పొడిబారిపోవడం, సహజ కాంతి తగ్గిపోవడం జరుగుతుంది.

శరీరంలో ప్రోటీన్ తక్కువైతే గోళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. గోళ్ళు తొందరగా విరిగిపోవడం, పగిలిపోవడం మొదలవుతాయి. ముఖ్యంగా గోళ్ళ వృద్ధి మందగించడం, అలంకారాల సమయంలో అసౌకర్యం కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి.

కండరాల నిర్మాణానికి ప్రోటీన్ అవసరం. దీని లోపం వల్ల కండరాలు బలహీనమవుతాయి. కండరాల దెబ్బతినడం, నొప్పులు రావడం, శరీర ఆకృతి మారడం వంటి సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ చేసే వారికి ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది.

ప్రోటీన్ శరీర కణాల మరమ్మతుకు అవసరం. ఇది తక్కువగా ఉన్నప్పుడు గాయాలు త్వరగా మానవు. చిన్న గాయాలకైనా ఎక్కువ రోజులపాటు చికిత్స అవసరం అవుతుంది. ఇది రోగనిరోధక శక్తి బలహీనతకు సంకేతం.

ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా వైరస్‌లు, బాక్టీరియా వంటి హానికర సూక్ష్మజీవుల్ని ఎదుర్కొనే శక్తి కూడా బలహీనమవుతుంది. తరచూ జలుబు, జ్వరం, అలర్జీలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ప్రోటీన్ లోపం నరమండల వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. దీనివల్ల మానసిక స్థితి దెబ్బతిని, డిప్రెషన్, నిద్రలేమి, మనోవేదన వంటి సమస్యలు రావచ్చు. శరీర శక్తి తగ్గడమూ దీని ప్రధాన కారణాలలో ఒకటి.

ఈ విధంగా శరీరానికి ప్రోటీన్ తగిన మోతాదులో లభించకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు వాటిని చిన్నవిగా చూడకుండా వైద్య సలహా తీసుకుని సరైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలు రోజువారీ డైట్‌లో చేర్చడం ద్వారా ఈ సమస్యలను దూరం చేయవచ్చు.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..