Sleep on The Floor: నేలపై పడుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే.. మంచం ఎత్తి బయట పడేస్తారు..!
నేలపై నిద్రపోతున్నప్పుడు నిద్రలో మనకు సహజ శరీర కదలిక ఉంటుంది. దీంతో మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. వేసవిలో నేలపై పడుకోవడం వల్ల శరీరానికి కాస్త చల్లగా ఉంటుంది. నేల చల్లదనానికి శరీర వేడి నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనివల్ల మరింత గాఢంగా నిద్ర పోవచ్చు. అంతేకాదు బాడీ పెయిన్స్ తో బాధ పడుతున్న వారికి నేలపై పడుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

పరుపుపై పడుకుంటే చాలా మందికి వెన్ను, మెడ నొప్పి సమస్యలొస్తుంటాయి. అదే నేలపై పడుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేల లాంటి గట్టి ఉపరితలాలు సహజ వక్రతకు సపోర్ట్ నిస్తాయి. వెన్నెముకని సరిగ్గా ఉంచి, వెన్నునొప్పిని తగ్గించంలో సాయపడతాయి. నేలపై పడుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. నేలతో అనుబంధం పెరుగుతుంది. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ ఉండి, కంటినిండా నిద్రపడుతుందని చెబుతున్నారు.
నేలపై పడుకోవడం వల్ల శరీర భంగిమ సరైన రీతిలో, వెన్నెముక నిటారుగా ఉంటుంది. నేలపై పడుకో వడం వల్ల శరీరానికి కావలసిన సహజమైన విశ్రాంతి లభిస్తుంది. ఇది మన వీపును నిటారుగా ఉంచుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. మనస్సులోని ఆందోళనలు తగ్గుతాయి. నేల మీద పడుకోవడం వల్ల జీర్ణక్రియ అవయవాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
నేలపై నిద్రపోతున్నప్పుడు నిద్రలో మనకు సహజ శరీర కదలిక ఉంటుంది. దీంతో మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. వేసవిలో నేలపై పడుకోవడం వల్ల శరీరానికి కాస్త చల్లగా ఉంటుంది. నేల చల్లదనానికి శరీర వేడి నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనివల్ల మరింత గాఢంగా నిద్ర పోవచ్చు. అంతేకాదు బాడీ పెయిన్స్ తో బాధ పడుతున్న వారికి నేలపై పడుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. నేల మీద పడుకోవడం వల్ల ఏకాగ్రత మెరుగుపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..