అయ్యో పాపం.. పెంపుడు కుక్క కోసం మొసలితో ఫైట్ చేసిన యువతి.. చివరకు ఏమైందంటే..
సదరు మహిళ ఒకరోజు సాయంత్రం వెస్ట్‌వుడ్ లేక్స్‌లోని ఒక చెరువు దగ్గర తన కుక్కను వాకింగ్ కోసం తీసుకెళ్లింది, కానీ ఆ చెరువులో 6.5 అడుగుల పొడవైన మొసలి దాగి ఉందని ఆ మహిళకు తెలియదు. ఆమె కుక్కతో చెరువు వద్దకు చేరుకోగానే, మొసలి ఎక్కసారిగా ఎగిరిపడింది. కుక్కపై దాడి చేసి మింగేసే ప్రయత్నం చేసింది..దాంతో ఆ మహిళ ఏమీ ఆలోచించకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి కుక్క ప్రాణాలను కాపాడటానికి మొసలిపై దాడి చేసింది.

పెంపుడు కుక్కల పట్ల యజమానులకు ఎనలేని ప్రేమ. వాటిని తమ ఇంట్లోని కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. ఎంతగానో ప్రేమించే పెంపుడు కుక్కకు ఏదైనా అపాయం వచ్చిందంటే తట్టుకోలేరు. వాటికోసం ఎంతకైనా తెగిస్తారు. ఇక్కడ కూడా ఓ మహిళ తన పెంపుడు కుక్కకోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. ఫ్లోరిడాకు చెందిన కింబర్లీ స్పెన్సర్ అనే మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి తన కుక్కను మొసలి బారి నుండి కాపాడుకుంది. సదరు మహిళ ఒకరోజు సాయంత్రం వెస్ట్‌వుడ్ లేక్స్‌లోని ఒక చెరువు దగ్గర తన కుక్కను వాకింగ్ కోసం తీసుకెళ్లింది, కానీ ఆ చెరువులో 6.5 అడుగుల పొడవైన మొసలి దాగి ఉందని ఆ మహిళకు తెలియదు. ఆమె కుక్కతో చెరువు వద్దకు చేరుకోగానే, మొసలి ఎక్కసారిగా ఎగిరిపడింది. కుక్కపై దాడి చేసి మింగేసే ప్రయత్నం చేసింది..దాంతో ఆ మహిళ ఏమీ ఆలోచించకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి కుక్క ప్రాణాలను కాపాడటానికి మొసలిపై దాడి చేసింది.
కుక్కపై దాడి చేసిన మొసలి దాన్ని చెరువులోకి ఈడ్చుకెళ్లింది. దాంతో ఆ మహిళ వెంటనే చెరువులోకి దూకేసింది. దాని నోరు తెరిచి ఉండటంతో మొసలి వీపుపైకి దూకిన ఆమె..మొసలి దవడలను బలవంతంగా తెరిపించింది. అలా మొసలి దవడలను గట్టిగా పట్టుకోవటంతో తన పెంపుడు కుక్క ప్రమాదం నుంచి బయటపడింది.
ఈ ప్రమాదం తర్వాత కింబర్లీ మాట్లాడుతూ తనకు మొసళ్ళు, పాములు అంటే చాలా భయం అని చెప్పింది. కానీ ఆ రోజు కుక్క ప్రాణం ప్రమాదంలో ఉందని గ్రహించినప్పుడు తన భయం వెంటనే మాయమైందని చెప్పింది. అందుకే తన గురించి పట్టించుకోలేదని చెప్పింది. కానీ ఆ కుక్కను ఎలాగైనా కాపాడుకోవాలని తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రిస్క్ చేసింది. ప్రమాదం తర్వాత, మహిళను ఆసుపత్రికి తరలించారు. కుక్కను పశువైద్యశాలకు తరలించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..