AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ 10 నిమిషాలు సైకిల్ తొక్కితే చాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు అనేకం..!

నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సుఖవంతమైన రవాణా మార్గాల కారణంగా ప్రజలు ఉబకాయం, బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. అందుకే సైకిల్‌ తొక్కడం అలవాటుగా చేసుకోవాని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ 10 నిమిషాలు సైకిల్ తొక్కితే చాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు అనేకం..!
Cycling
Jyothi Gadda
|

Updated on: Apr 07, 2025 | 12:19 PM

Share

ఒకప్పుడు వాహనాలు ఎక్కువగా లేని కాలంలో ఎక్కువ మంది ప్రజలు ఉపయోగించే ప్రధాన రవాణా వనరు సైకిల్‌.. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లలంటే, చాలా మంది సైకిల్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. దాంతో వారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరెళ్లకు పైగా జీవించేవారు. కానీ, నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సుఖవంతమైన రవాణా మార్గాల కారణంగా ప్రజలు ఉబకాయం, బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. అందుకే సైకిల్‌ తొక్కడం అలవాటుగా చేసుకోవాని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

సైక్లింగ్ వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. సైకిల్ తొక్కేటప్పుడు శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడుతున్నవారు సైకిల్ తొక్కితే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. బరువు తగ్గాలనుకునేవారికి సైక్లింగ్‌ ఒక మంచి మార్గం అని నిపుణులు చెబుతున్నారు. సైకిలింగ్‌ జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. కండరాలను పెంచుతుంది, శరీరంలో కొవ్వును కరిగిస్తుంది.

స్థిరమైన సైక్లింగ్ గంటకు సుమారు 300 కేలరీలు బర్న్ చేస్తుంది. సైక్లింగ్‌ మీ బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. బ్రిటీష్ పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ అరగంట సైకిల్ తొక్కితే.. ఒక ఏడాదిలో దాదాపు ఐదు కిలోల కొవ్వును కరిగిస్తుంది. రెగ్యులర్‌ సైక్లింగ్‌ మీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. సైక్లింగ్ మీ గుండె కండరాలను బలపరుస్తుంది. రెస్టింగ్‌ పల్స్‌ తగ్గిస్తుంది. రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. మీ హృదయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..