AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి తంతు.. పెళ్లిలో వరుడి షూ దాచి రూ.50 వేలు డిమాండ్‌! 5 వేలే ఇచ్చాడని.. మరీ ఇలా చేస్తారా?

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిన ఒక ముస్లిం వివాహ వేడుకలో "జూతా చుపాయి" ఆచారం తీవ్ర వివాదానికి దారితీసింది. వధువు చెల్లెలు వరుడి బూట్లు దాచిపెట్టి ₹50,000 డిమాండ్ చేయగా, వరుడు ₹5,000 మాత్రమే ఇవ్వడంతో గొడవ జరిగింది. ఇరు కుటుంబాల మధ్య తలపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం పోలీసులకు చేరింది.

ఇదెక్కడి తంతు.. పెళ్లిలో వరుడి షూ దాచి రూ.50 వేలు డిమాండ్‌! 5 వేలే ఇచ్చాడని.. మరీ ఇలా చేస్తారా?
Joota Chupai
SN Pasha
|

Updated on: Apr 07, 2025 | 12:36 PM

Share

వివాహ వేడుకల్లో భాగంగా కొంతమంది కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటాయి.  పెళ్లి వేడుకల్లో.. వధువు తమ్ముళ్లు, చెల్లెళ్లు, వరుడి బూట్లను దాచి పెట్టి, అప్పగింతల సమయంలో డబ్బులు డిమాండ్‌ చేసే వింత ఆచారం కూడా ఒకటి ఉంది. ఇది సరదాగా చేస్తుంటారు. బావను ఆటపట్టించేందుకు చేసే పని. కానీ, సరదాగా చేసే ఈ ఆచారం ఓ పెళ్లిలో తీవ్ర వివాదానికి దారి తీసి ఏకంగా పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిన పెళ్లి వేడుకల్లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని చక్రతాకు చెందిన ముహమ్మద్ షబీర్ శనివారం తన కుటుంబంతో బిజ్నోర్ చేరుకున్నాడు.

ఈ క్రమంలో వధువు చెల్లెలు వరుడి బూట్లను ‘జూతా చుపాయి’ ఆచారంలో భాగంగా దాడి పెట్టింది. ఆ తర్వాత బూట్లు ఇవ్వాలంటే తనకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. కానీ, పెళ్లి కొడుకు షబీర్‌ కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవకు దారి తీసింది. రూ.50 వేలు అడిగితే.. రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు.. వీడెక్కడి బికారి(బిచ్చగాడు) అంటూ వధువు తరపు వాళ్లు నోరు పారేసుకున్నారు. అది విని వరుడి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు షబీర్‌ను ఓ రూమ్‌లో వేసి పిచ్చి కొట్టుడు కొట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడి చేరుకొని, ఇరు వర్గాల వారిని శాంతిపజేశారు.

ఆ తర్వాత ఈ ఘటనపై ఇరు కుటుంబాలు బిజ్నోర్‌లోని నాజీబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పెళ్లి కొడుకు కుటుంబం డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తుందని, పెళ్లి కూతురు ముఖ్యమా? డబ్బు ముఖ్యమా అని అడిగితే తమకు డబ్బే ముఖ్యమని పెళ్లి కొడుకు చెప్పాడని, అలాగే పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు తాము పెట్టిన బంగారం నాణ్యతపై తమతో గొడవకు దిగారంటూ వధువు తరఫు వాళ్లు పోలీసులకు వెల్లడించారు. ఆ తర్వాత వరుడి తరఫు వాళ్లు వాళ్ల వాదన వాళ్లు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న పోలీసులు వారికి నచ్చజెప్పి.. రాజీ కుదిర్చారు. మొత్తానికి జూతా చుపాయి అనే ఆచారం ఇంతకీ తీసుకొచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..