Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలా.. ఇంటి ఆవరణలో ఈ మొక్కలు పెంచండి.. స్వయం చాలకంగా దోషాలు తొలగిపోతాయి..
హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం.. ఇంట్లో పెట్టే వస్తువులు మాత్రమే కాదు ఇంట్లోని మొక్కలు లేదా ఇంటి ఆవరణ లోని చుట్టుపక్కల కొన్ని చెట్లను నాటడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఎవరి ఇంట్లో అయినా వాస్తు దోషాలు ఉంటే.. ఇంటి ఆవరణలో కొన్ని చెట్లు నాటితే వాస్తు దోషాలు స్వయంచాలకంగా తొలగిపోతాయి. ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ప్రతికూల శక్తి మాయమవుతుంది. ఆ మొక్కలు ఏమిటో తెలుసుకుందాం..

ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో నివసించేవారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకనే ఇంటిని నిర్మించే సమయంలో వాస్తు నియమాలను పాటిస్తారు. చాలా మంది వాస్తు దోషాన్ని నివారించడానికి వాస్తు నిపుణులను సంప్రదిస్తారు. అంతేకాదు ఇంట్లోని గదుల నిర్మాణాన్ని మాత్రమే కాదు.. ఇంట్లో పెట్టుకునే వస్తువులను వాస్తు నిపుణుల సూచనల ప్రకారం ఉంచుతారు. అయితే ఇంట్లో వాస్తు దోషాలను తొలగించడానికి, ఇంటితో పాటు చుట్టుపక్కల ప్రాంతం, పర్యావరణ సమతుల్యత కూడా అంతే ముఖ్యమైనది.
మీ ఇంట్లో , చుట్టుపక్కల శుభ్రమైన, స్వచ్ఛమైన గాలి ఉంటే, వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇది ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా చుట్టుపక్కల కొన్ని చెట్లను నాటితే వాస్తు దోషాలు స్వయంచాలకంగా తొలగిపోయి.ఇంట్లో సానుకూల శక్తి నిలిచి ఉంటుంది. ఈ రోజు మనం అలాంటి కొన్ని చెట్ల గురించి తెలుసుకుందాం
ఏ చెట్టును ఇంట్లో నాటాలంటే
అశోక చెట్టు – మీరు మీ ఇంటికి ఉత్తర దిశలో అశోక చెట్టును నాటితే.. వాస్తు శాస్త్రం ప్రకారం అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అశోక చెట్టు ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది.
అరటి చెట్టు – అరటి చెట్టును కూడా శుభప్రదంగా భావిస్తారు. మీరు మీ ఇంటికి ఈశాన్య దిశలో అరటి చెట్టును నాటవచ్చు. అరటి చెట్టుతో పాటు తులసి చెట్టును నాటితే ఫలితాలు మరింత శుభప్రదంగా ఉంటాయి.
కొబ్బరి చెట్టు – మీ ఇంటి సరిహద్దులో కొబ్బరి చెట్లను నాటితే.. అవి చాలా శుభ ఫలితాలను ఇస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది ఇంట్లో నివసించే వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
మర్రి చెట్టు – మర్రి చెట్టును కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీ ఇంటికి తూర్పు దిశలో ఈ చెట్టును నాటితే, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే, ఈ చెట్టు నీడ మీ ఇంటిపై పడకూడదని గుర్తుంచుకోండి. ఈ చెట్టును ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఉసిరి చెట్టు – వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి సరిహద్దులో ఈ చెట్టు ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ చెట్టు మీ ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు