Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padyatra: హిందూ ధర్మంలో తీర్ధయాత్రలు ఎందుకు చేస్తారు? పాదయాత్రగా దేవుడి దర్శనానికి వెళ్ళడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

హిందూ మతంలో ఆధ్యాత్మిక యాత్రలకు చాలా ముఖ్యమైనది స్థానం ఉంది. తీర్ధయత్రాలను చేయడానికి ప్రతి హిందువు ఏదోక సమయంలో ఆసక్తిని చూపిస్తారు. పురాతన కాలం నుంచి తమకు ఇష్టమైన దేవుడిని దర్శించుకునేందుకు కొండలు కోనలు ఎక్కి.. మరీ పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఈ పూర్వకాలం నుంచి ట్రెక్కింగ్ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే హిందూ మతంలో మతపరమైన తీర్థయాత్రలు ఎందుకు చేపడతారు? దాని ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా?

Padyatra: హిందూ ధర్మంలో తీర్ధయాత్రలు ఎందుకు చేస్తారు? పాదయాత్రగా దేవుడి దర్శనానికి వెళ్ళడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
Padyatra Importance In Hindu Dharma
Follow us
Surya Kala

|

Updated on: Apr 03, 2025 | 8:13 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర ఈ రోజుల్లో బాగా చర్చనీయాంశమైంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని మోతీ ఖవ్డి నుంచి ప్రారంభించిన ఈ పాదయాత్ర ద్వారక వరకు సాగనుంది. అనంత్ అంబానీ రోజూ దాదాపు 10-12 కిలోమీటర్లు నడుస్తున్నారని చెబుతున్నారు. అతను 140 కిలోమీటర్లు మేర నడిచి తన గమ్యాన్ని చేరుకోనున్నారు. ఇలా పాదయాత్ర చేసే సమయంలో అనంత్ అంబానీ దేవుని నామాన్ని జపిస్తూ, కీర్తనలు పాడుతూ ఉన్నాడు. హిందూ మతంలో పాదయాత్ర చేస్తూ తీర్ధయాత్ర చేసే సంప్రదాయం చాలా పాతది. ఈ రోజు ఇలా పాదయాత్ర ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. దాని ప్రాముఖ్యత ఏమిటి?

తీర్థయాత్రకు మతపరమైన ప్రాముఖ్యత

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి పవిత్ర స్థలానికి పాదయాత్ర చేయడం ద్వారా అతని ఆత్మ శుద్ధి అవుతుంది. మతపరమైన తీర్థయాత్రకు వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతాడు. దానితో పాటు, దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. మతపరమైన తీర్థయాత్రను ఆధ్యాత్మిక ప్రయాణంగా పరిగణిస్తారు. హిందూ మత గ్రంథాలలో ఎవరైతే కొండ కొనలను దాటుకుంటూ శివుడు, విష్ణువు, అమ్మవారి పవిత్ర స్థలాలను చేరుకుంటారో వారు మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. నడక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది.

పాదయాత్ర ప్రాముఖ్యత

జ్యోతిషశాస్త్రంలో మతపరమైన తీర్థయాత్రలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది. జ్యోతిషశాస్త్రంలో ఎవరైతే మతపరమైన తీర్థయాత్రలు చేపడతారో వారికి ఉన్న గ్రహ దోషాలు తొలగుతాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేయడం ద్వారా శని దోషం, ఏలి నాటి శని ప్రభావం తగ్గుతుంది. ఎవరి జాతకంలోనైనా రాహు-కేతువు స్థానం అశుభంగా ఉంటే..తీర్థయాత్ర చేయడం ద్వారా ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. అంతేకాదు తీర్థయాత్రలు కుజ గ్రహానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఎవరైనా మతపరమైన తీర్థయాత్ర చేస్తున్నప్పుడు దేవుని మంత్రాలను జపిస్తే.. అది జాతకంలో శుభ గ్రహ కలయికలను సృష్టిస్తుంది.

ఇవి కూడా చదవండి

పితృ దోషంతో బాధపడుతున్న వ్యక్తికి, మతపరమైన తీర్థయాత్ర చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పూర్వీకుల ఆత్మల శాంతి కోసం మతపరమైన తీర్థయాత్రలు చేపట్టాలని జ్యోతిష గ్రంథాలలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి, తమ ఆశీస్సులను ఇస్తారని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు