AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garudapurana: మహిళలు గరుడ పురాణంలో ఇచ్చిన స్థానం ఏమిటి? పరాయి స్త్రీని కోరుకుంటే ఎటువంటి శిక్షనో తెలుసా

గరుడ పురాణం వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోకం గురించి వర్ణన ఉంటుంది. మానవుడు చేసే పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలకు ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించే మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది. అంతేకాదు గరుడ పురాణంలో పరాయి స్త్రీకి లేదా తన నియంత్రణలో లేని స్త్రీని కిడ్నాప్ చేసి అనుచితంగా ప్రవర్తిస్తే.. అతనికి దక్కే జన్మ గురించి కూడా పేర్కొంది.

Garudapurana: మహిళలు గరుడ పురాణంలో ఇచ్చిన స్థానం ఏమిటి? పరాయి స్త్రీని కోరుకుంటే ఎటువంటి శిక్షనో తెలుసా
Garuda Purana
Surya Kala
|

Updated on: Apr 03, 2025 | 9:06 PM

Share

ప్రపంచంలో చాలా మంది మహిళలకు సరైన హోదా, గౌరవం ఇవ్వబడలేదని చెబుతారు. వారు నిరంతరం దోపిడీకి గురవుతున్నారని సరైన స్థానం, గౌరవం ఇవ్వడం లేదని నిరంతరం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఇది పైకి నిజమే అనిపించినా.. మన హిందూ ధర్మంలో స్త్రీకి ప్రముఖ స్థానం ఇచ్చింది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారని పేర్కొంది. అయితే బంగారానికి కూడా ఎలా రక్షణ అవసరమో.. సమాజంలో స్త్రీకి కూడా రక్షణ అవసరం అని కొన్ని కట్టుబాట్లను నియమాలను ఏర్పాటు చేసింది.

అదేవిధంగా గొప్ప వ్యక్తికి, గొప్ప వస్తువులకు రక్షణ అవసరం. పూజలో ఉపయోగించే పువ్వుల నుంచి శ్రేష్ఠతకు దారితీసే ప్రతిదానికీ ఒక చట్రం అవసరం. స్త్రీ కూడా అంతే. స్త్రీని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పిల్లలు రక్షించాలి. ఆమెకు స్వేచ్ఛ ఎందుకు లేదనే దానికి సమాధానం ఏమిటంటే ఆమె చాలా పూజ్యమైనది.. అందుకే ఆ స్త్రీని రక్షించడం తండ్రిగా, భర్తగా , కొడుకుగా వారి కర్తవ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి.

అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం స్త్రీకి కష్టాలు కలిగించే ఎటువంటి పరిస్థితిని సృష్టించకూడదు. ఎందుకంటే అలా చేయడం మహా పాపం. గరుడ పురాణం పాపాలకు, పుణ్యాలకు తగిన పరిణామాలను సూచించే అత్యంత ప్రామాణికమైన పురాణం. పర స్త్రీని కోరుకున్నా.. స్త్రీలను ఇబ్బందులకు గురి చేసినా బ్రహ్మరాక్షస స్థితి బారిన పడాల్సి ఉంటుంది. బ్రహ్మ రాక్షసి స్థితి అంటే మరణానంతరం శుభాలు పొందకుండా సంచరించే స్థితి అని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం ఇది అత్యంత నీచమైన, కఠినమైన స్థితి. గరుడ పురాణం ప్రకారం స్త్రీని వేధిస్తే.. ఈ స్థితికి చేరుకోవాలని చెబుతుంది.

ఇవి కూడా చదవండి

సంస్కారవంతురాలు, విద్యావంతురాలు, గౌరవప్రదురాలు అయిన స్త్రీని గౌరవిస్తే, దేవతలు కూడా అక్కడ సంతోషంగా ఉంటారని మనుస్మృతిలో పేర్కొనబడింది. అదే విధంగా గరుడ పురాణం ప్రకారం స్త్రీలకు సంబంధించిన అనేక నియమాలున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
పెరుగు తింటారా..? అయితే.. ఈ కాంబినేషన్ వెరీ బ్యాడ్ అంట..
పెరుగు తింటారా..? అయితే.. ఈ కాంబినేషన్ వెరీ బ్యాడ్ అంట..
కొంపముంచిన దోమల పొగ.. కారులో కాలిబూడిదైన యువకుడు.. !
కొంపముంచిన దోమల పొగ.. కారులో కాలిబూడిదైన యువకుడు.. !
కోహ్లీకి షాక్ ఆర్సీబీ ఆల్ టైమ్ టీంను ప్రకటించిన దినేష్ కార్తీక్
కోహ్లీకి షాక్ ఆర్సీబీ ఆల్ టైమ్ టీంను ప్రకటించిన దినేష్ కార్తీక్
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు
సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి
సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి
ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. డేటా ట్యాక్స్' కట్టాల్సిందే
ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. డేటా ట్యాక్స్' కట్టాల్సిందే
హీరోయిన్ ట్రెడిషనల్ లుక్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న వయ్యారి..
హీరోయిన్ ట్రెడిషనల్ లుక్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న వయ్యారి..
తిరుమలలో రాత్రి చివరగా జరిగే పర్యంకాసనం సేవ గురించి మీకు తెలుసా?
తిరుమలలో రాత్రి చివరగా జరిగే పర్యంకాసనం సేవ గురించి మీకు తెలుసా?
డెలివరీ మ్యాన్‌గా మారిన 78 ఏళ్ల వృద్ధుడు..!
డెలివరీ మ్యాన్‌గా మారిన 78 ఏళ్ల వృద్ధుడు..!
కియా నుంచి ఆటోమేటిక్‌ వేరియంట్‌.. ధర కేవలం రూ.10 లక్షలలోపే..!
కియా నుంచి ఆటోమేటిక్‌ వేరియంట్‌.. ధర కేవలం రూ.10 లక్షలలోపే..!