Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dandelion Tea: టీకి బదులుగా డాండెలైన్ హెర్బల్ టీని చేర్చుకోండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

Dandelion Tea Benefits: డాండలియన్ మొక్క మానవుడికి ప్రకృతి అందించిన ఓ వరం. దీనిలో అనేక ఔషధగుణాలున్నాయి. ఈ డాండలియన్ పువ్వులు, వేర్లతో, ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ హెర్బల్ టీని ఎన్నో శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ రోజు డాండలియన్ టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

Dandelion Tea: టీకి బదులుగా డాండెలైన్ హెర్బల్ టీని చేర్చుకోండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Dandelion Tea
Follow us
Surya Kala

|

Updated on: Apr 03, 2025 | 7:04 PM

డాండెలైన్ (టరాక్సాకమ్ అఫిసినేల్) అనేది యూరప్‌కు చెందిన ఒక మూలిక. ఈ మొక్క ఆకు, పువ్వు, వేర్లు వివిధ ఇన్ఫెక్షన్లకు ఔషధాలుగా ఉపయోగిస్తున్నారు. యూరోప్ లోని ఉత్తర అర్ధగోళంలోని తేలికపాటి వాతావరణాలలో డాండెలైన్ కనిపిస్తుంది. పసుపు రంగులో అందంగా ఉండే ఈ మొక్క ను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో మూత్ర ఉత్పత్తిని పెంచే .. మూత్రపిండాలు, మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్లకు దారితీసే మూత్రంలో స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించే రసాయనాలను కలిగి ఉంటుంది. మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు , UTIలు సహా అనేక వ్యాధుల నివారణకు డాండెలైన్‌ను ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా డాండలియన్ వేర్లను, ఆకులను, పువ్వులను టీ గా తీసుకుంటున్నారు. ఈ రోజు డాండలియన్ టీ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

మూత్రవిసర్జనను ప్రోత్సహిస్తుంది: డాండలియన్ మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. ఇది మూత్రవిసర్జనను పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలోని అదనపు నీరు, ఉప్పును తొలగిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: డాండలియన్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడానికి: డాండలియన్ లో కేలరీలు తక్కువగా ఉండడమే కాదు.. పైబర్ కూడా ఎక్కువగా ఉంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉండడంతో తినాలి అనే కోరికను తగ్గిస్తుంది.

కాలేయ ఆరోగ్యానికి: డాండలియన్ కాలేయ పని తీరు మెరుగుపరుస్తుంది. కాలేయ నుంచి విషాన్నితొలగించి కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

రోగనిరోధక శక్తి: డాండలియన్ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో: షుగర్ పేషెంట్స్ కు డాండలియన్ ఓ వరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర శోషణను తగ్గించడానికి మంచి సహాయకారిగా పనిచేస్తుంది.

రక్తపోటును తగ్గిస్తుంది: డాండలియన్ లో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం: డాండెలైన్ కొన్ని రకాల క్యాన్సర్ల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇప్పటివరకు టెస్ట్ ట్యూబ్‌లలో క్యాన్సర్ పెరుగుదలపై డాండెలైన్ ప్రభావాన్ని అధ్యయనాలు పరిశీలించాయి. ఇది కొన్ని క్యాన్సర్‌ల పెరుగుదలను నెమ్మదింపజేయడంలో సహాయపడుతుందని కనుగొన్నాయి .

డాండలియన్ టీని తయారు చేసే పద్దతి

డాండలియన్ ఆకులతో టీకి కావాల్సిన పదార్ధాలు.. తాజా డాండలియన్ ఆకులు , నీరు.. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల నీరు పోసి అందులో తాజా డాండలియన్ ఆకులు వేసి మరిగించాలి. 10 నిమిషాలు మరిగించి అప్పుడు ఆ టీని వడకట్టి.. తేనె లేదా నిమ్మరసం జోడించి తాగాలి.

డాండలియన్ వేర్లతో టీ తయారు చేసే పద్దతి

స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో రెండు కప్పుల నీరు పోసి.. నీరు మరిగించి.. ఆపై రెండు స్పూన్ల ఎండిన డాండలియన్ వేర్ల పొడి వేసి 15 నిమిషాల పాటు మరిగించండి. అనంతరం తేనె లేదా నిమ్మరసం జోడించి టీని తాగండి.

డాండలియన్ పువ్వుతో టీ తయారు చేసే పద్దతి

తాజా డాండలియన్ పువ్వులను తీసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని రెండు కప్పుల నీరు పోసి నీరు మరిగిన తర్వాత డాండలియన్ పువ్వులు వేసి 10 నిమిషాలు టీ మరిగించండి. అంతే డాండలియన్ పువ్వు హెర్బల్ టీ రెడీ. తేనె లేదా నిమ్మరసం కలిపి తాగండి.

టీ తయారు చేసుకునే ముందు తప్పని సరిగా పాటించాల్సిన విషయాలు..

తాజా డాండలియన్ ఆకులు, పువ్వులు, వేర్లను ఉపయోగించి టీ తయారు చేసుకుంటుంటే.. తప్పని సరిగా వాటిని శుభ్రం చేసుకోవాలి. అయితే డ్రై డాండలియన్ వేరు ఉపయోగించాలనుకుంటే తప్పనిసరిగా మంచిది ఎంచుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)