శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమౌతుంది..? శుభమా..అశుభమా.. శాస్త్రం ఏం చెబుతోంది..!
మన ప్రాచీన సంప్రదాయాల్లో శకునాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా గౌళి శాస్త్రం అనే జ్యోతిష శాస్త్రంలో బల్లి మన శరీరంపై పడటం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో వివరించబడింది. పురుషులకు, మహిళలకు వేర్వేరు ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. కొన్ని సందర్భాల్లో బల్లి పడటం శుభ సూచకంగా భావిస్తారు. మరికొన్ని సందర్భాల్లో అపశకునంగా పరిగణిస్తారు. అయితే దీని ప్రభావం బల్లి పడిన ప్రదేశాన్ని బట్టి మారుతుందని విశ్వసిస్తారు.

భారతీయ సంప్రదాయంలో బల్లి శకునాన్ని విశ్వసించే వారు చాలా మందే ఉన్నారు. పురాణాల ప్రకారం బల్లి పడే ప్రదేశాన్ని బట్టి ఫలితాలు మారతాయి. పురుషులకు, మహిళలకు వేర్వేరు శుభాశుభాలు ఉంటాయని చెప్పబడింది. ఉదాహరణకు పురుషుడికి కుడి భాగంపై బల్లి పడితే శుభం, ఎడమ భాగంపై పడితే అశుభం అని భావిస్తారు. అదే విధంగా మహిళలకు ఎడమ భాగంపై బల్లి పడితే శుభప్రదం, కుడి భాగంపై పడితే అపశకునం అని చెబుతారు. బల్లి పడే ప్రదేశాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి అంటారు.
తలపై బల్లి పడితే
- తలపై బల్లి పడితే వివాదాలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు.
- తలపై అగ్రభాగంలో పడితే అప్పుల భయం పెరిగే అవకాశం ఉంటుంది.
- ముఖంపై పడితే ఊహించని ధనలాభం జరగొచ్చు.
- ఎడమ కంటిపై పడితే శుభవార్త వింటారని చెబుతారు.
- కుడి కంటిపై పడితే అనుకున్న పని పూర్తి కాకపోవచ్చు.
ముఖంపై బల్లి పడితే
- నుదుటిపై పడితే ప్రేమ సంబంధాల్లో సమస్యలు తలెత్తవచ్చు.
- పై పెదవిపై పడితే గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి.
- కింది పెదవిపై పడితే ఆర్థిక లాభం కలుగుతుంది.
- రెండు పెదవులపై పడితే దూరపు బంధువుల నుంచి చెడు వార్త వింటారని భావిస్తారు.
- నోటిపై పడితే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని చెబుతారు.
చేతులు, వేళ్లు, మణికట్టు
- కుడి చేతిపై బల్లి పడితే కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశముంది.
- ఎడమ చేతిపై పడితే అవమానం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
- వేళ్లపై పడితే పాత మిత్రులను కలిసే అవకాశం ఉంటుంది.
- మణికట్టుపై పడితే ఇంట్లో మార్పులు జరగవచ్చని నమ్ముతారు.
వీపు, కాళ్లపై బల్లి పడితే
- తొడలపై పడితే దుస్తుల నష్టం జరగవచ్చని చెబుతారు.
- వీపుపై పడితే విజయ సూచకంగా భావిస్తారు.
- కాళ్లపై పడితే అనవసర ప్రయాణాలు జరగవచ్చని చెబుతారు.
గౌళి శాస్త్రం పూర్తిగా మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. శకునాలు పూర్తిగా మన మానసిక స్థితిని ప్రభావితం చేసే అంశాలు మాత్రమే. శుభ శకునాల్ని విశ్వసించటం మంచిదే కానీ అపశకునాలపై భయపడటం అవసరం లేదు. జీవితం మన కర్మపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కేవలం బల్లి పడిందని భయపడకుండా మన ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాలి.