AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Rama Navami: సిరి సంపదలు, సుఖ సంతోషాల కోసం శ్రీ రామ నవమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..

హిందూ మతంలో శ్రీ రామనవమి పండగకు విశిష్ట స్థానం ఉంది. ఎక్కడున్నాసరే చైత్రశుద్ధ నవమికి పచ్చటిపందిరిలో సీతారాముల కల్యాణం చూసేందుకు చేరుకోవాల్సిందే. ఈ రోజున శ్రీరాముడిని పూజించే సంప్రదాయం మాత్రమే కాదు సీతారాముల కల్యాణం చేస్తారు కూడా. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేసే వారు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ రోజు శ్రీ రామ నవమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.

Sri Rama Navami: సిరి సంపదలు, సుఖ సంతోషాల కోసం శ్రీ రామ నవమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..
Sri Rama Navami 2025
Follow us
Surya Kala

|

Updated on: Apr 03, 2025 | 7:52 PM

దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకూ జానకీ రాముల కళ్యాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. లోకాభిరాముడు, సుగుణాభిరాలు అయిన శ్రీ సీతా రాముల కళ్యాణమహోత్సవం వీక్షించాలని, శ్రీ సీతా రామచంద్ర ప్రభువుల ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే శ్రీ రామ నవమి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారంగా శ్రీరాముని భావిస్తారు. మానవుడుగా జన్మించి దేవుడిగా మారి పూజలను ఆడుకుంటున్న శ్రీ రాముడి జననాన్ని గుర్తుచేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి జరుపుకుంటారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 6న రామ నవమిని జరుపుకోనున్నారు.

ఈ రోజున దేవాలయాలలో మాత్రమే కాదు గల్లీ గల్లీ లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సీతారాముల కళ్యాణం చేస్తారు. శ్రీరాముని ఊరేగింపు జరుగుతుంది. ఈ రోజున శ్రీరాముడిని పూజించే వారు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు ఈ రోజు తెలుసుకుందాం..

శ్రీ రామ నవమి రోజున ఏమి చేయాలంటే

  1. ఉదయాన్నే లేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించండి.
  2. శ్రీరాముని పట్ల భక్తితో చేతులు జోడించి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేయండి
  3. ఇవి కూడా చదవండి
  4. మనస్సుని నిర్మలంగా, స్వచ్ఛమైన ఆలోచనలతో ఉంచుకోండి. రోజంతా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి.
  5. శ్రీ రామ నవమి రోజున శ్రీ హనుమంతుడిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  6. హనుమాన్ చాలీసా, బజరంగ్ బాన్, సుందరా కాండను పఠించండి .
  7. హనుమంతుడికి శనగలు, బెల్లం నైవేద్యంగా సమర్పించండి. సింధూరం దిద్దండి
  8. ఈ రోజున పేదలకు ఆహారం, బట్టలు దానం చేయండి.
  9. రోజంతా “శ్రీ రామ” నామాన్ని జపిస్తూ, ధ్యానంలో రామ దర్బార్‌ను స్మరించుకోండి.
  10. ఈ రోజున, శ్రీరాముడికి పంచామృతంతో స్నానం చేయించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించండి.
  11. శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముని మంత్రాలను జపించండి.

శ్రీ రామ నవమి రోజున ఏమి చేయకూడదంటే

  1. శ్రీ రామ నవమి రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి తామసిక పదార్థాలు తినకూడదు. ఈ రోజున సాత్విక ఆహారం తినాలి.
  2. ఈ రోజున ఎవరూ ఎవరినీ అవమానించకూడదు లేదా అసభ్యకరమైన భాషను ఉపయోగించకూడదు.
  3. శ్రీ రామనవమి రోజున అబద్ధం చెప్పవద్దు సత్యాన్ని అనుసరించాలి.
  4. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకుండా ఉండాలి.
  5. ఈ రోజున ఇంటికి వచ్చే ఏ వ్యక్తినీ ఖాళీ చేతులతో వెనక్కి పంపవద్దు. ఇలా చేయడం వలన శ్రీరాముడు కోపంగా ఉండవచ్చు. కనుక ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అరుదైన అమావాస్య.. ఆ రాశుల వారికి విశిష్ట యోగాలు పక్కా..!
అరుదైన అమావాస్య.. ఆ రాశుల వారికి విశిష్ట యోగాలు పక్కా..!
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్‌ ఛూమంత్రం.. ఈ 15 అలవాట్లతో హాంఫట్..
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్‌ ఛూమంత్రం.. ఈ 15 అలవాట్లతో హాంఫట్..
కేకేఆర్ కి శుభవార్త: జట్టు చేరిన జమ్మూ ఎక్స్‌ప్రెస్!
కేకేఆర్ కి శుభవార్త: జట్టు చేరిన జమ్మూ ఎక్స్‌ప్రెస్!
పసిడిపై నమ్మలేని ఆఫర్లు.. ఆ యాప్స్‌లో అందుబాటులో డిజిటల్ గోల్డ్.!
పసిడిపై నమ్మలేని ఆఫర్లు.. ఆ యాప్స్‌లో అందుబాటులో డిజిటల్ గోల్డ్.!
బెంజ్ కారునుంచి లోకల్ ట్రైన్‌‌ వరకు పడిపోయాం..
బెంజ్ కారునుంచి లోకల్ ట్రైన్‌‌ వరకు పడిపోయాం..
కోతులు ఆడించుకునేదనుకునేరు? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
కోతులు ఆడించుకునేదనుకునేరు? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
'తొలి బంతికే సిక్స్.. కట్‌చేస్తే.. ఏడాదికే కెరీర్ క్లోజ్'
'తొలి బంతికే సిక్స్.. కట్‌చేస్తే.. ఏడాదికే కెరీర్ క్లోజ్'
భూకంపం వస్తుందని టిక్‌టాక్‌లో వీడియో.. ఆ తర్వాత ఏం జగిరిందంటే..
భూకంపం వస్తుందని టిక్‌టాక్‌లో వీడియో.. ఆ తర్వాత ఏం జగిరిందంటే..
41 ఫోర్లు, 21 సిక్సర్లతో విరుచుకుపడ్డ అరవీర భయంకరులు..
41 ఫోర్లు, 21 సిక్సర్లతో విరుచుకుపడ్డ అరవీర భయంకరులు..
ఫ్రీ హిట్‌ మిస్‌.. కావ్య మారన్‌ వైరల్ ఎక్స్‌ప్రెషన్‌
ఫ్రీ హిట్‌ మిస్‌.. కావ్య మారన్‌ వైరల్ ఎక్స్‌ప్రెషన్‌