Rudraksha: రుద్రాక్ష ఎలా ఉద్భవించింది.. దీనిని ధరించడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..
హిందూ మత గ్రంథాలలో రుద్రాక్ష ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. రుద్రాక్ష శివుడికి చాలా ప్రియమైనది. శివుని ఆశీర్వాదం పొందడానికి ప్రజలు రుద్రాక్షలను ధరిస్తారు. అయితే రుద్రాక్షలు ఎలా ఉద్భవించాయో.. రుద్రాక్ష ధరించడానికి కొన్ని నియమాలున్నాయి. వాటిని ధరించడం వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

హిందూ మతంలో ప్రదోష ఉపవాసం ప్రతి నెల కృష్ణ, శుక్ల పక్ష త్రయోదశి రోజున ఆచరిస్తారు. ప్రదోష ఉపవాసం శివుడికి అంకితం చేయబడింది. ప్రదోష వ్రతం రోజున ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రదోష వ్రతం రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు నిలిచి ఉంటాయి. ప్రదోష ఉపవాసం రోజున రుద్రాక్ష ధరించడం కూడా చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.
శివుడితో రుద్రక్షకు సంబంధం
రుద్రాక్షకు శివునితో చాలా లోతైన సంబంధం ఉంది. శివ పురాణం, స్కంద పురాణంలో రుద్రాక్ష గురించి వివరంగా వివరించబడింది. రుద్రాక్ష ధరించే వ్యక్తులు కొన్ని నియమాలను పాటించాలి. దీన్ని ధరించడం చాలా ప్రయోజనకరం. అయితే తరచుగా ప్రజల మనస్సులలో ఈ ప్రశ్న వస్తుంది.. శివుడికి ప్రియమైన ఈ రుద్రాక్ష ఎప్పుడు, ఎలా ఉద్భవించింది. రుద్రాక్ష మూలం? దానిని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
రుద్రాక్ష ఎలా ఉద్భవించిందంటే
పురాణాల ప్రకారం పురాతన కాలంలో త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను భూమిపై భయాన్ని సృష్టించాడు. అంతేకాదు దేవతలను కూడా త్రిపురాసురుడి చాలా ఇబ్బందులు పెట్టారు. త్రిపురాసురుడిని ఓడించడంలో దేవతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. చివరికి దేవతలందరూ శివుని వద్దకు చేరుకొని శరణ కోరారు. దేవతలు శివుని వద్దకు చేరుకున్న.. సమయంలో శివుడు యోగాసనంలో ధ్యానంలో మునిగి ఉన్నాడు.
మహా దేవుడి తపస్సు పూర్తయిన తర్వాత అతని కళ్ళ నుంచి కన్నీళ్ళు భూమిపై పడ్డాయి. హిందూ విశ్వాసాల ప్రకారం శివుని కన్నీళ్లు ఎక్కడ పడ్డాయో అక్కడ రుద్రాక్ష వృక్షాలు పెరిగాయి. అంటే రుద్రాక్షలు శివుని కన్నీళ్ల నుంచి ఉద్భవించాయి. మహాదేవుడు త్రిపురాసురుడిని సంహరించాడు. ఈ రుద్రాక్షలలో 14 రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ వారి సొంత ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య, పౌర్ణమి, శ్రావణ మాసం సోమవారం, ప్రదోష ఉపవాసం చేసే సమయంలో రుద్రాక్షను ధరించాలని నమ్ముతారు.
రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
రుద్రాక్షలు ధరించే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వారు ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు. రుద్రాక్ష ధరించే వారిపై మహాదేవుని ఆశీస్సులు ఉంటాయి. పాపాలు నశిస్తాయి. శారీరక వ్యాధులు తొలగిపోతాయి. భయాలు తొలగుతాయని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు