AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: పిల్లల గదిలో ఇవి తప్పనిసరిగా ఉండాలి..! రోజంతా సంతోషంగా గడుపుతారు..!

చిన్నారుల గది అంటే వాళ్లకు సంతోషాన్ని, సురక్షితతను, సృజనాత్మకతను కలిగించే ప్రదేశం. ఆ గది ఆడుకుంటూ చదువుకునే చిన్న ప్రపంచంలా ఉండాలి. అలాంటి గదిని తీర్చిదిద్దేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలపై శ్రద్ధ పెట్టాలి. పిల్లలకు మంచి వాతావరణం ఇవ్వాలంటే ఇవి ఫాలో అవ్వండి. 

Parenting Tips: పిల్లల గదిలో ఇవి తప్పనిసరిగా ఉండాలి..! రోజంతా సంతోషంగా గడుపుతారు..!
Parenting Tips
Prashanthi V
|

Updated on: Apr 07, 2025 | 10:02 PM

Share

పిల్లల గదిని వాళ్ల అభిరుచికి అనుగుణంగా డెకరేట్ చేయడం వల్ల వాళ్ల మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. గోడలపై వారి ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లతో ఉన్న ఫ్రేమ్స్ లేదా సన్నివేశాలు ఉన్న ఫోటో ఫ్రేమ్స్ పెట్టడం మంచిది. రెండు నుండి మూడు రకాల ఫ్రేమ్స్ ఎంచుకుని గదిని అలంకరిస్తే పిల్లలకు ఎక్కువసేపు అక్కడే ఉండాలనిపిస్తుంది.

పిల్లలకు చిన్ననాటి నుంచి పుస్తకాల పట్ల ఆసక్తి పెరగాలంటే గదిలో ఒక చిన్న బుక్ షెల్ఫ్ తప్పకుండా ఉండాలి. ఇందులో వాళ్లు ఇష్టపడే కథల పుస్తకాలు, కలర్ బుక్స్, బొమ్మల పుస్తకాలు వంటి వాటిని అమర్చవచ్చు. ఇది చదవడానికి ప్రోత్సాహం ఇస్తుంది. అంతేకాదు శుభ్రంగా ఉండే అలవాటును కూడా నేర్పుతుంది.

పిల్లల గది గోడలను సాదాగా ఉంచకుండా రంగులు తక్కువగా ఉన్న ఫ్లోరల్ డిజైన్లు లేదా కార్టూన్ పాతర్న్స్ ఉన్న వాల్ పేపర్లు ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల గదికి కొత్త లుక్ వస్తుంది. అంతేకాకుండా పిల్లలతో కలిసి వాల్ పేపర్ ఎంపిక చేయిస్తే వాళ్లకు ఓనర్‌షిప్ ఫీలింగ్ వస్తుంది.

పిల్లల భౌగోళిక అవగాహన పెంచాలంటే గదిలో ఒక పెద్ద వరల్డ్ మ్యాప్ పెడితే చాలా మంచిది. దీని వల్ల దేశాలు, నగరాలు, సముద్రాలు వంటి విషయాలు సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతారు. మ్యాప్‌ను గోడపై పెద్దగా అమర్చడం వల్ల వారు రోజూ చూసే సాధనంగా మారుతుంది.

పిల్లల గదిలో ఎక్కువ ప్రదేశం ఉండాలంటే సోఫా కమ్ బెడ్ ఉపయోగించడం ఉత్తమమైన పరిష్కారం. ఇది పగటిపూట కూర్చోవడానికి, రాత్రిపూట నిద్ర పోవడానికి సౌకర్యంగా ఉంటుంది. చిన్న గదుల్లో ఈ ఫర్నిచర్ బాగా ఉపయోగపడుతుంది.

సాధారణంగా కనిపించే కుషన్స్ కంటే పిల్లలు ఇష్టపడే కార్టూన్ డిజైన్లతో ఉన్న కుషన్లు, బొమ్మల కవర్లు వాడితే వాళ్ల గదికి మానసిక ఉల్లాసం వస్తుంది. కొన్ని కుషన్లు స్ఫూర్తినిచ్చే కోటేషన్లతో ఉంటే కూడా మంచిదే. ఇలాంటి చిన్న విషయాలు కూడా పిల్లల్లో హ్యాపీనెస్ పెంచుతాయి.

ఈ విధంగా చిన్న చిన్న మార్పులు, చక్కని ఐటమ్స్ సహాయంతో పిల్లల గదిని వారు ఇష్టపడే విధంగా మార్చొచ్చు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను, ఆనందాన్ని, చదువుపై ఆసక్తిని పెంచుతుంది. మంచి వాతావరణం ఉన్న గదిలో పెరిగే పిల్లలు ఎల్లప్పుడూ ఉల్లాసంగా, శ్రద్ధగా ఉంటారు.