ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆకుకూరల్లో పాలకూర ఎంతో ప్రత్యేకం. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
పాలకూరను కూర రూపంలో, సలాడ్ రూపంలో ఎలా తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరలో విటమిన్ ఎ, సి, కె1 లతో పాటు ఫోలేట్, ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు దండిగా ఉంటాయి
TV9 Telugu
పాలకూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
TV9 Telugu
అలాగే పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీటాకెరోటీన్, లుటీన్, జియాక్సంతిన్, క్లోరోఫిల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడడంలో సహాయపడతాయి
TV9 Telugu
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా అడ్డుకవడంతో పాలకూర ఎంతో ఉపయోగపడుతుంది. పాలకూరలో క్యాన్సర్ నివారణకు దోహదపడే సమ్మేళనాలు కూడా ఉన్నాయట
TV9 Telugu
పాలకూరలో నైట్రేట్ ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
TV9 Telugu
పాలకూరను తీసుకోవడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ స్థాయిలు ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
కాబట్టి డయాబెటిస్ రోగులు దీనిని తీసుకోవడం వల్ల చక్కెరలను నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది